తిరుమల : పవిత్రమైన వైకుంఠద్వార దర్శనాలకు తొలిమూడురోజులు డిసెంబర్ 30,31, జనవరి 1న దర్శన టోకెన్లు ఉన్న భక్తులను మాత్రమే అనుమతినిస్తామని టిటిడి (TTD) చైర్మన్ బిఆర్ నాయుడు స్పష్టమైన ప్రకటన చేశారు. మూడురోజులు ఎలాంటి టోకెన్లు లేని భక్తులు తిరుమలకొండకు వచ్చినా దర్శనాలు కల్పించలేమని, ఆలయంలోపలకు అనుమతించడం కుదరని వెల్లడించారు. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని , దర్శనాలు టోకెన్లున్న వారికి మాత్రమేనని ఛైర్మన్ నాయుడు తేల్చిచెప్పారు. తిరుమలకు సాధారణంగానే భక్తులు వచ్చినా పైన ఏర్పాట్లు, విద్యుత్ అలంకరణలు, అదనపు ముస్తాబు చూసుకోవచ్చన్నారు. భక్తులను ఎవరినీ తిరుమలకు రావద్దని చెప్పడం లేదని, అయితే టోకెన్లు ఉన్న వారికి మాత్రమే దర్శనాలు ఉంటాయని భక్తులకు స్పష్టమైన విజప్తి చేశారు.
Read also: Partnership : విద్యార్థుల కోసం పార్ట్నర్ షిప్ సమ్మిట్ – సీఎం చంద్రబాబు

TTD
డిసెంబర్ 30,31తేదీల్లో వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల్లో భక్తులను అనుమతించే విషయం, ఏర్పాట్లు, వదంతులుపై మంగళవారం సాయంత్రం క్యాంపు కార్యాలయంలో ఛైర్మన్ బీఆర్ నాయుడు మీడియా ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తీసుకున్న చర్యలు, పటిష్టమైన విధానం అమలు, ఏర్పాట్లుపై వివరించారు. కొంతమంది సామాజిక మాధ్యమాల్లో వైకుంఠ ఏకాదశి, ద్వాదశిన తిరుమలకు భక్తులు రావద్దని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, అయితే టోకెన్లు లేని భక్తులకు దర్శనాలు చేయించలేమనే చెబుతున్నామన్నారు. గత ఏడాది చోటుచేసుకున్న సంఘటనలతో ఈ ఏడాది పూర్తిగా ఆన్లైన్లో దర్శన టోకెన్లు జారీచేయడం జరిగిందన్నారు.
టోకెన్లు లేకుంటే దర్శనాలు ఉండవనేది
తొలి మూడు రోజులకు 1.89 లక్షల మంది సామాన్యభక్తులకు ఇ డిప్ ద్వారా టోకెన్లు కేటాయించామన్నారు. టోకెన్లలో ఉన్న వివరాల మేరకు భక్తులు ఆయారోజుల్లో నిర్దేశిత సమయానికి రావాలని సూచించారు. గత మూడునెలల నుండి వైకుంఠ దర్శనాలకు సంబంధించి పూర్తిస్థాయి ప్రణాళికలతో ఉన్నామన్నారు. ఇప్పటినుండే భక్తులకు విస్తృతస్థాయిలో అవగాహన, చైతన్యం కల్పించేలా ప్రచారం చేయడం జరుగుతుందన్నారు. తిరుమలకు నేరుగా భక్తులు వచ్చినా టోకెన్లు లేకుంటే దర్శనాలు ఉండవనేది తెలుసుకోవాలన్నారు. తిరుమలకు వచ్చి చిన్నపాటి ఇబ్బందులుకు గురికావద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. భక్తులకు సేవచేయడానికి పద్దతి ప్రకారం విధానాలను అమలు చేస్తున్నామన్నారు.
ప్రజలకు మరింతగా అవగాహన కల్పించాలని
తిరుమలకు వచ్చి ప్రశాంతంగా, సాఫీగా ఉంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. ఎవరైనా అనవసరంగా రెచ్చగొట్టేలా ప్రయత్నిస్తే పోలీసులు, విజిలెన్స్ విభాగాలు ముందుచూపుతో వ్యవహరిస్తాయని చైర్మన్ తెలిపారు. ఉన్నంతవరకు అవకాశాన్ని బట్టి టోకెన్లు ఉన్నవారికే దర్శనాలు కల్పిస్తామని దీనిపై తెలుగురాష్ట్రాలు, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల్లో మరింతగా విస్తృతంగా ప్రచారం చేస్తామని, ప్లెక్సీలు, కరపత్రాలు, గోడపత్రికలతో తీసుకెళతామని చైర్మన్ జనంలోకి బిఆర్నాయుడు తెలిపారు. మీడియా ప్రతినిధులు కూడా వైకుంఠద్వార దర్శనాలపై ప్రజలకు మరింతగా అవగాహన కల్పించాలని ఆయన కోరారు. ఈ మీడియా సమావేశంలో టిటిడి సిపిఆర్ ఒ డాక్టర్లారి రవి, పిఆర్, నీలిమ పాల్గోన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: