అమెరికన్ టెన్నిస్ ప్లేయర్ వీనస్ విలియమ్స్ (Venus Williams). ఆమె ఏడు గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ సాధించింది. మహిళల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్ 1 ర్యాంక్‌ను కైవసం చేసుకుంది. తన సోదరి సెరెనా విలియమ్స్‌తో కలిసి టెన్నిస్ ప్రపంచంలో గొప్ప పేరు సంపాదించింది. వీనస్ ఐదు వింబుల్డన్ సింగిల్స్ టైటిల్స్, రెండు యూఎస్ ఓపెన్ సింగిల్స్ టైటిల్స్ గెలుచుకుంది. ఆమె మూడుసార్లు మహిళల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్ 1 ర్యాంక్‌ను సాధించింది. మొత్తం 11 వారాల పాటు ఆ స్థానంలో కొనసాగింది.
Read Also: Virender Sehwag: రిటైర్మెంట్ తర్వాత సినిమాలు చూడటమే నా పని: సెహ్వాగ్
సోషల్ మీడియా లో వెల్లడించారు
వీనస్ (Venus Williams) రెండు ఒలింపిక్ బంగారు పతకాలను గెలుచుకుంది. తాజాగా, వీనస్ విలియమ్స్, ఇటాలియన్ యాక్టర్ ఆండ్రియా ప్రెటి వివాహం చేసుకున్నారు. ఫ్లోరిడాలోని పామ్ బీచ్‌లో 5 రోజులపాటు వీరి పెళ్లి వేడుకలు జరిగాయి. పెళ్లి విషయాన్ని వీనస్ సోషల్ మీడియా లో వెల్లడించారు. గత 16 నెలలుగా ఆటకు దూరంగా ఉన్న ఆమె జనవరి లో ఆక్లాండ్‌లో జరిగే WTA టూర్ 33వ స్ట్రెయిట్ సీజన్‌లో పాల్గొననున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: