స్మార్ట్ ఫోన్ వినియోగించే వారు వాట్సాప్ (Whats App) వాడకుండా ఉండరని చెప్పొచ్చు. ఇది నిత్యజీవనంలో ఒక భాగమైపోయింది. ఎంత బిజీగా ఉన్నా కూడా .. తరచుగా వాట్సాప్ (Whats App)చెక్ చేసుకుంటూ ఉంటుంటాం. ఎక్కడెక్కడి నుంచో సమాచారం ఇందులో మనం చూస్తుంటాం. వాట్సాప్‌లోనే చాట్ చేసుకుంటారు. వాయిస్, వీడియో కాల్స్ చేసుకుంటుంటారు. కోట్లల్లో వాట్సాప్ అకౌంట్లు ఉంటాయి. ఇక్కడ వాట్సాప్‌ను కొదరు దుర్వినియోగం చేసే వారు ఉంటారు.
Read Also: AI 1 Pay: ఏఐ 1పే పేరుతో కెనరా బ్యాంక్ కొత్త యాప్
పగడ్బందీ చర్యలు
మంచి పనుల కోసం వాడే వారితో పాటు.. చెడు పనుల కోసం,హానికర కంటెంట్ వ్యాప్తి చేసేందుకు ఇలా వినియోగించే వారు కూడా ఉంటారు. అందుకే దీనిని నివారించేందుకు మెటా (Meta) కు చెందిన వాట్సాప్ యాజమాన్యం.. ఎప్పటినుంచో పగడ్బందీ చర్యలు తీసుకుంటూ వస్తోంది.నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే ఖాతాలు,

తప్పుడు సమాచారం వ్యాప్తి చేసే అకౌంట్లపై ప్రతి నెలా సగటున 98 లక్షల వరకు బ్లాక్ చేస్తోంది. ప్రభుత్వం సూచనల మేరకు నవంబర్ నెలలో సుమారు 29 లక్షల ఖాతాలు, గ్రూపులను తొలగించింది. అయితే, గోప్యత కారణాల వల్ల బ్లాక్ అయిన నంబర్ల పూర్తి వివరాలు వెల్లడించకపోవడంతో పోలీసులకు నేరస్థులను పట్టుకోవడం కష్టమవుతోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: