58 రకాల శస్త్ర చికిత్సలు చేయడానికి వీలు హర్షం వ్యక్తంచేసిన మంత్రి సత్యకుమార్ యాదవ్(Minister Satyakumar) సచివాలయం : పురాతన భారతీయ వైద్య విధానాన్ని ఆధునిక చికిత్సా విధానంతో అనుసంధానం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తగు శిక్షణతో శస్త్ర చికిత్స ప్రక్రియకు సంబంధించి పోస్టు గ్రాడ్యుయేట్ పూర్తి చేసుకున్న ఆయుర్వేద వైద్యులు స్వతంత్రంగా ఆపరేషన్లు చేయడానికి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్(Minister Satyakumar) ఆమోదం తెలిపారు. ఇండియన్ మెడిసిన్ సెంట్రల్ కౌన్సిల్ నియమావళి – 2020 మరియు నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్ జారీ చేసిన మార్గదర్శకాల మేరకు ఆయుర్వేద వైద్యులు శస్త్ర చికిత్సలు చేసేలా తగు గుర్తింపుతో పాటు అనుమతినివ్వడానికి మంత్రి అంగీకరించారు.

Skin Disease: చర్మవాధులతో ఇబ్బంది పడుతున్న వైసిపి నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డి
ఈ నిర్ణయంతో ఇప్పటికే శస్త్ర చికిత్సా విధానంలో పీజీ పట్టా పొందిన వైద్యులు శస్త్ర చికిత్సలు చేయడానికి అవకాశం లభిస్తుంది. ప్రభుత్వ నిర్ణయం మేరకు 39శల్యతంత్ర(జనరల్ సర్జరీ) చికిత్సలు, 19శలక్యతంత్ర(ఇఎన్ మరియు ఆప్తమాలజీ) చికిత్సలను ఆయుర్వేద వైద్యులు చేయవచ్చు, వీటిలో కొన్ని అంటువ్యాధులకు సంబంధించిన శస్త్ర చికిత్సలు, ప్రమాదాల కారణంగా దెబ్బతిన్న జీవ కణాల తొలగింపు, గాయాలకు చికిత్స, కుట్లు వేయడం, మొలలు, మలద్వారంలో చీలికలకు చికిత్స, కణతులు, శుక్లాలు, గవదల తొలగింపు, కండరాల చికిత్స, చర్మ మార్పిడి చికిత్స(స్కిన్ గ్రాఫ్టింగ్). ఈ అంశంపై తదురపరి చేపట్టాల్సిన చర్యల్ని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆయుష్ విభాగ డైరెక్టర్ కె.దినేష్ కుమార్, ఇతర అధికారులతో విస్తృతంగా చర్చించారు.
రాష్ట్రంలో విజయవాడలోని డాక్టర్ ఎన్ఆర్ఎస్ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాలతో పాటు మరో రెండు ప్రైవేట్ కళాశాలలున్నాయని, ఆయా కళాశాలల్లో పిజీ స్థాయిలో అందించబడుతున్న కోర్సుల గురించి అధికారులు మంత్రికి వివరించారు. విజయవాడ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాలలో తక్షణమే శల్యతంత్ర, శకల్యతంత్ర పిజీ కోర్సులను ప్రవేశపెట్టాలని, నాణ్యమైన విద్యను
అందించడానికి తగు చర్యల్ని చేపట్టాలని మంత్రి ఆదేశించారు. 2500సంవత్సరాల చరిత్ర కలిగిన శల్య మరియు శకల్య ఆయుర్వేద చికిత్స పరిజ్ఞానాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకునేందుకు ఆ విద్యనభ్యసించిన వారు శస్త్ర చికిత్సలు చేపట్టే అవకాశం కల్పించినందుకు చాలా సంతోషంగా ఉందని మంత్రి వ్యాఖ్యానించారు. భారతీయ వైద్య విధాన ప్రక్రియలను ఆధునిక ప్రక్రియలతో అనుసంధానం చేయడానికి ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని మంత్రి అన్నారు. ఇందుకు సంబంధిత విధివిధానాలను కేంద్రం 2000సంవత్సరంలోనే విడుదల చేసినా గత ప్రభుత్వం చర్యలు చేపట్టలేదని, ఆయుష్ సేవల పట్ల వారి నిర్లక్ష్యానికి ఇది మరో తార్కాణమని మంత్రి అన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: