సచివాలయం : కొబ్బరి ద్వారా విలువ ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మూడు ఎకరాల్లో ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్,ఐదు ఎకరాల్లో ఇంక్యూబేషన్ సెంటర్ తోపాటు రైతు ఉత్పత్తి సంస్థలను ప్రోత్సహించడం ద్వారా కొబ్బరి రైతులకు న్యాయం జరిగేలా చూడాలని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంద్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్(Minister Kondapalli Srinivas) అన్నారు. మంగళవారం సచివాలయంలోని మంత్రి కార్యాలయం నుంచి కొబ్బరి పరిశ్రమ అభివీద్ధిపై వివిధ శాఖల అధికారులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
Read Also: AP Corruption: సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో భారీగా ఎసిబి సోదాలు

ఈ సందర్భంగా మంత్రి(Minister Kondapalli Srinivas) మాట్లాడుతూ కొబ్బరి విలువ ఆధారిత పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రతిపాదించిన రాజోలు నియోజకవర్గంలోని తూర్పుపాలెం, అమలాపురం రాష్ట్ర నియోజకవర్గం మామిడికుదురు మండలం పెదపట్నం లంక ఉప్పలగుప్తంలో ఈ పారిశ్రామిక క్లస్టర్లను ఏర్పాటు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. రాజోలు నియోజకవర్గంలో కొబ్బరి సాగు విస్తీర్ణం 25వేల ఎకరాల్లో ఉందని, వార్షిక ఉత్పత్తి 30 నుంచి 40కోట్ల కొబ్బరికాయలు ఉంటుందన్నారు.ప్రస్తుతం రైతులు కొబ్బరి కాయల తొక్కలు తీసి, ఎండుకొబ్బరి కాయలను తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల మార్కెట్లకు పంపుతున్నారని, అక్కడే ప్రాసెసింగ్ చేసే విలువ ఆధారిత ఉత్పత్తులు తయారు చేస్తున్నారన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: