విజయవాడ : రాష్ట్రవ్యాప్తంగా సబరిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు నిర్వహించింది. ఆకస్మిక తనిఖీల్లో 4 చోట్ల క్రిమినల్ కేసులు ఏసీబీ అధికారులు నమోదు చేశారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బందికి చెందిన 14 ఇళ్లలో సోదాలు చేపట్టారు. 4 చోట్ల క్రిమినల్ కేసులు పలు కీలకపత్రాలు, దస్తావేజులు స్వాధీనం ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఎసిబి అధికారులు విచారణ నవంబరు 5,6 తేదీల్లోనూ పలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించారు. గత నెలలో సిబ్బంది నుంచి అధికారులు పెద్ద మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నారు. విశాఖ జగదాంబ సెంటర్లోని రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బందిపై కేసు నమోదు చేశారు. జాయింట్ సబ్ రిజిస్ట్రార్ మోహనరావు, ఇద్దరు సిబ్బంది ఇళ్లలో సోదాలు చేశారు. విజయనగరం (Vizianagaram) జిల్లా భోగాపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బందిపై కేసు నమోదు చేశారు.
Read also: CM Pawan: Dy.CM ఆదేశాలతో AP అటవీ ప్రాంతాల్లో వన్యజంతు భద్రతా చర్యలు

AP Corruption
పల్నాడు జిల్లా నరసరావుపేట
సబ్ రిజిస్ట్రార్ పందిళ్లపల్లి రామకృష్ణ, ఐదుగురు సిబ్బంది ఇళ్లలో సోదాలు నిర్వహించగా అనంతపురం జిల్లా చిలమత్తూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బందిపై కేసు నమోదు చేశారు. జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ ఇన్ఛార్జ్ ప్రసాద్ బాబు, ఇతరులపై ఇళ్లలో సోదాలు చేపట్టారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ పంజా విసిరింది. తెల్లవారుజాము నుంచే ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. కార్యాలయంతో పాటు విజయవాడ భవానీపురం లో నివాసం ఉంటున్న ఇంఛార్జ్ సబ్ రిజిస్టర్ మహమ్మద్ ఇంట్లో తనిఖీలు చేశారు. కొండపల్లిలో జూనియర్ అసిస్టెంట్ దివ్య నివాసం లోనూ ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. విజయనగరం జిల్లాలోని భోగాపురం, ఎన్టీఆర్ జిల్లాలోని ఇబ్రహీంపట్నం, ప్రకాశం జిల్లాలోని ఒంగోలు, సత్యసాయి జిల్లాలోని చిలమత్తూరు, నెల్లూరు జిల్లాలోని స్టోన్స్పేట, విశాఖపట్నం జిల్లాలోని మధురవాడ, పల్నాడు జిల్లా నరసరావుపేట తదితర సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అనిశా అధికారులు తనిఖీలు చేపట్టారు.
అవినీతి ఆరోపణలు రావడంతో
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ ఆకస్మిక దాడులు చేసింది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై అవినీతి ఆరోపణలు రావడంతో అధికారులు మెరుపు దాడులు చేశారు. బయట వ్యక్తులను అనుమతించకుండా కార్యాలయం గేట్లు కూడా మూసేశారు. సాధారణ తనిఖీల్లో భాగంగానే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి విచ్చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. తమ పరిధిలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను కూడా తనిఖీ చేస్తున్నామని ఏసీబీ అధికారులు వివరించారు. ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలతో విజయనగరం జిల్లా భోగాపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బంది ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు.
సబ్ రిజిస్ట్రార్ పందిళ్లపల్లి రామకృష్ణ సహా ఆరుగురు సిబ్బంది ఇళ్లలో తనిఖీలు చేసి పలు కీలక ఆధారాలు స్వాధీనం చేసుకున్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అనధికార విధులు నిర్వహించే కనకరాజు ఇంటి నుంచి రూ.15 లక్షలు క్యాష్, 12 బ్యాంక్ పాసు పుస్తకాలతో పాటు ఆస్తుల పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. 20 రోజుల కిందట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో చేసిన తనిఖీల్లో అనిశా అధికారులకు, సబ్ రిజిస్ట్రార్ కు చెందిన ఆదాయానికి మించిన ఆస్తులకు సంబంధించిన కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. వాటి ఆధారంగా సబ్ రిజిస్ట్రార్ రామకృష్ణ సహా మిగిలిన సిబ్బంది ఇళ్లల్లో ఏకకాలంలో విస్తృత తనిఖీలు చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు సబ్ రిజిస్ట్రార్ ప్రసాద్ బాబు ఇంట్లోనూ ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు.
బ్యాంకు లావాదేవీలు, ఇతర రికార్డులను పరిశీలించారు
చిలమత్తూరు సబ్ రిజిస్ట్రార్ ప్రసాద్ బాబు అనంతపురంలో నివాసం ఉంటున్నారు. చిలమత్తూరులో ఉంటున్న సోమశేఖర్ అనే వ్యక్తి ద్వారా సబ్ రిజిస్ట్రార్ కు నగదు లావాదేవీలు ఉన్నాయనే విషయమై గతంలో కేసు నమోదైంది. కోర్టు ఆదేశాలతో ఇవాళ మళ్లీ ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. అనంతపురంలోని ప్రసాద్ బాబు ఇంట్లో, చిలమత్తూరు ఉంటున్న సోమశేఖర్ నివాసంలో ఏకకాలంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. నగదు బ్యాంకు లావాదేవీలు, ఇతర రికార్డులను పరిశీలించారు. డీఎస్పీ ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో అనంతపురంలోని రాజహంస గోల్డ్ హోమ్స్ లో ఉన్న చిలమత్తూరు సబ్ రిజిస్ట్రార్ ప్రసాద్ బాబు ఇంట్లో కూడా ఏసీబీ తనిఖీలు చేపట్టారు. బ్యాంకు లావాదేవీలు, ఇతర రికార్డులను పరిశీలించారు. ప్రస్తుతం ఆయా రికార్డుల ఆధారంగా వివరాలు సేకరిస్తున్నామని అధికారులు పేర్కొన్నారు. వీటి ఆధారంగా వివరాలు సేకరిస్తున్నామని ఏసీబీ అధికారులు చెప్పారు
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: