H1B visa lottery ends : అమెరికాలో Donald Trump పరిపాలన కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నాళ్లుగా అమలులో ఉన్న H-1B వర్క్ వీసా లాటరీ విధానాన్ని రద్దు చేసి, కొత్తగా నైపుణ్యం మరియు అధిక జీతం ఆధారంగా వీసాలు కేటాయించే విధానాన్ని తీసుకురానుంది. ఈ మార్పుతో భారత్ సహా ఇతర దేశాలకు చెందిన ఎంట్రీ-లెవల్ ప్రొఫెషనల్స్‌కు అమెరికాలో ఉద్యోగ వీసా పొందడం మరింత కష్టమయ్యే అవకాశముంది.
అమెరికా Department of Homeland Security తెలిపిన వివరాల ప్రకారం, ఈ కొత్త నిబంధనలు 2026 ఫిబ్రవరి 27 నుంచి అమల్లోకి రానున్నాయి. 2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ సీజన్ నుంచి ఏటా ఇచ్చే సుమారు 85 వేల H-1B వీసాల కేటాయింపునకు ఈ విధానం వర్తిస్తుంది.
Read Also: Phone Hack: ట్రాఫిక్ చలాన్ వచ్చిందని మెసేజ్ వచ్చిందా? మీ ఫోన్ హ్యాక్ అవ్వొచ్చు!
ప్రస్తుత లాటరీ విధానాన్ని కొందరు అమెరికన్ యజమానులు (H1B visa lottery ends) తక్కువ జీతాలకే విదేశీ కార్మికులను తీసుకురావడానికి దుర్వినియోగం చేశారని US Citizenship and Immigration Services ప్రతినిధి తెలిపారు. అందుకే కొత్త విధానంలో అధిక నైపుణ్యం, అధిక వేతనం పొందే అభ్యర్థులకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు.
ఇప్పటికే ట్రంప్ ప్రభుత్వం H-1B వీసాలపై ఏడాదికి అదనంగా 1 లక్ష డాలర్ల ఫీజు విధించే ప్రకటన చేసింది. అలాగే ధనికుల కోసం 10 లక్షల డాలర్ల “గోల్డ్ కార్డ్” వీసా మార్గాన్ని కూడా ప్రవేశపెట్టింది. ఈ మార్పులన్నీ కలిపి అమెరికా వీసా విధానాన్ని పూర్తిగా కొత్త దిశలో నడిపిస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
భారతీయులకు H-1B వీసా అత్యంత కీలక మార్గం. ముఖ్యంగా ఐటీ నిపుణులు, డాక్టర్లు పెద్ద సంఖ్యలో ఈ వీసాలపై అమెరికాలో పనిచేస్తున్నారు. అయితే జీతం ఆధారంగా ఎంపిక చేసే కొత్త విధానం వల్ల యువ భారతీయ ప్రొఫెషనల్స్‌కు అవకాశాలు తగ్గే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: