భారత క్రికెట్(Cricket) జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ తన అభిమానులను మరోసారి ఆశ్చర్యంలో పడేశాడు. ప్రపంచవ్యాప్తంగా(Rohit Sharma) పెద్ద క్రేజ్ కలిగిన నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్ ‘స్ట్రేంజర్ థింగ్స్’ చివరి సీజన్ ప్రమోషన్‌లో రోహిత్ పాల్గొని హైలెట్ సీన్స్ చూపించాడు. సిరీస్‌లోని ప్రధాన విలన్ ‘వెక్నా’కు ఫీల్డింగ్ సెట్ చేశానని రోహిత్ చెప్పిన డైలాగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రచార వీడియోలో రోహిత్ లాకర్ రూమ్‌లో తన టీమ్‌తో మాట్లాడుతూ, కెప్టెన్‌గానే సూచనలు ఇస్తున్నాడు. ఫైనల్ సీజన్ వస్తుంది. ప్రత్యర్థి మైండ్ గేమ్స్ ఆడినప్పుడు కూడా ఏ హెల్మెట్ కాపాడలేదు అంటూ క్రికెట్ పద్ధతిలో సీరియస్ పరిస్థితిని వివరించాడు. అలాగే, ‘వెక్నా’ను ఎదుర్కొనడానికి బృందాన్ని సిద్దంగా ఉంచాలని హెచ్చరించాడు.
Read Also: IPL: ఢిల్లీ క్యాపిటల్స్‌కు కొత్త కెప్టెన్లు?

చివరి సీజన్ విడుదల తేదీ
ఈ ప్రమోషన్ గురించి రోహిత్ మాట్లాడుతూ, (Rohit Sharma) “నేను చాలా సంవత్సరాలుగా సిరీస్ ఫ్యాన్. ఈ షోను చూడకుండా ఉండలేను. ఇప్పుడు ఫైనల్ సీజన్ కోసం నెట్‌ఫ్లిక్స్‌తో కలిసి పని చేయడం చాలా ఆనందంగా ఉంది. ‘వెక్నా’ ఫీల్డింగ్ సెట్ చేయడం నా భాగ్యం అని తన ఉల్లాసాన్ని వ్యక్తం చేశారు. ఈ సిరీస్ 1980ల నేపథ్యంలో హాకిన్స్ అనే ఊరిలో చోటుచేసుకునే అతీంద్రియ ఘటనల చుట్టూ తిరుగుతుంది. ‘అప్‌సైడ్ డౌన్’ అనే ఇతర ప్రపంచం, రహస్య ప్రభుత్వ ప్రయోగాలు వంటి అంశాలతో ఇది ప్రపంచవ్యాప్తంగా కోట్లు అభిమానులను సంపాదించుకుంది. ఈ సిరీస్ చివరి సీజన్ (సీజన్ 5, వాల్యూమ్ 2) డిసెంబర్ 26న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: