తిరుమల వైకుంఠ ద్వార దర్శనాలపై సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న వదంతులను భక్తులు నమ్మవద్దని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ బీఆర్ నాయుడు స్పష్టం చేశారు. దర్శనాల షెడ్యూల్‌పై ఎలాంటి అయోమయం అవసరం లేదని, టీటీడీ విడుదల చేసే అధికారిక సమాచారం మాత్రమే నమ్మాలని ఆయన కోరారు. భక్తుల సౌకర్యం, భద్రతే ప్రధాన లక్ష్యంగా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.
Read also: AP Government: ఫైళ్లూ కదలవు… పనులూ జరగవు..

Clarity on Vaikuntha Dwara darshanams
2 నుంచి 8 వరకు
డిసెంబర్ 30, 31 అలాగే జనవరి 1 తేదీల్లో ఈ-డిప్ టోకెన్లు ఉన్న భక్తులకు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామని, ఆ మూడు రోజుల్లో టోకెన్లు లేనివారికి దర్శనం ఉండదని బీఆర్ నాయుడు స్పష్టం చేశారు. అయితే జనవరి 2 నుంచి 8 వరకు టోకెన్లు లేని భక్తులకు కూడా సర్వదర్శనం ఉంటుందని తెలిపారు. టోకెన్లు లేకున్నా తిరుమలకు రావచ్చని, భక్తులను ఎవరూ అడ్డుకోరని భరోసా ఇచ్చారు. నకిలీ టికెట్లు, తప్పుడు ప్రచారాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: