కాంగ్రెస్ సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ (Shashi Tharoor) వ్యవహారం ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూనే.. ప్రధాని మోదీ, ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. అదే సమయంలో సొంత పార్టీపై తీవ్ర విమర్శలు చేస్తూ, పార్టీ సమావేశాలకు దూరంగా ఉంటూ నిత్యం హెడ్‌లైన్స్‌లో నిలుస్తున్నారు. తాజాగా థరూర్ మరోసారి వార్తల్లో నిలిచారు.
Read Also: http://Pongal gift: ఎంకే స్టాలిన్ ప్రారంభించనున్న పొంగల్ కానుక పథకం

బీహార్‌లో నితీశ్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంపై శశి థరూర్ ప్రశంసలు కురిపించారు. రాష్ట్రంలో మౌలిక సదుపాయాలపై నితీశ్ ప్రభుత్వం ఎక్కువగా దృష్టిపెట్టిందన్నారు. ‘నేను ఇంతకు ముందు విన్న దానికంటే రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు చాలా మెరుగ్గా ఉన్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. రోడ్లు మెరుగుపడ్డాయి. ప్రజలు అర్ధరాత్రి కూడా వీధుల్లోకి వస్తున్నారు. గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదు. శాంతి, భద్రతలు మెరుగుపడ్డాయి. విద్యుత్, నీటి సదుపాయాలు కూడా సరిగ్గా ఉన్నాయి’ అని ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ (Shashi Tharoor) థరూర్ వ్యాఖ్యానించారు. అదే సమయంలో నితీశ్ కుమార్ గురించి థరూర్‌ను ప్రశ్నించగా.. ‘నన్ను ఇక్కడ రాజకీయాల్లోకి లాగొద్దు. ఇక్కడ జరిగిన అభివృద్ధి చూసి సంతోషంగా ఉంది’ అని సమాధానమిచ్చారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: