అమెరికాలో (Donald Trump) అక్రమంగా నివసిస్తున్న వలసదారులు స్వచ్ఛందంగా తమ స్వదేశాలకు వెళ్లేందుకు ప్రోత్సహించేలా ట్రంప్ ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రకటించింది. ఈ ఏడాది ముగిసేలోపు అమెరికాను(America) విడిచిపెడితే వారికి 3,000 డాలర్లు (దాదాపు రూ.2.7 లక్షలు) నగదు ప్రోత్సాహకంతో పాటు ఉచిత విమాన ప్రయాణ సదుపాయం కల్పించనున్నట్లు డిసెంబర్ 22న హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం (DHS) వెల్లడించింది. ఈ పథకంలో భాగంగా స్వదేశాలకు వెళ్లే వారికి గతంలో విధించిన సివిల్ జరిమానాలను కూడా రద్దు చేస్తామని DHS స్పష్టం చేసింది. ఇందుకోసం వలసదారులు ‘CBP హోమ్’ అనే మొబైల్ యాప్ ద్వారా తమ వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని, యాప్‌లో సమాచారం నమోదు చేసిన తర్వాత ప్రయాణానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను ప్రభుత్వం తానే చూసుకుంటుందని DHS ప్రకటనలో తెలిపింది.
Read Also: Starlink: స్టార్‌లింక్ శాటిలైట్లను కూల్చనున్న రష్యా!

పథకాన్ని విస్మరిస్తే కఠిన చర్యలు అంటూ ప్రభుత్వ హెచ్చరిక
అయితే ఈ అవకాశాన్ని వినియోగించుకోని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. (Donald Trump) హోంల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శి క్రిస్టీ నోయెమ్ మాట్లాడుతూ, ఈ పథకాన్ని నిర్లక్ష్యం చేస్తే అక్రమ వలసదారులను గుర్తించి అరెస్ట్ చేసి దేశం నుంచి బహిష్కరిస్తామని, భవిష్యత్తులో వారు తిరిగి అమెరికాలోకి ప్రవేశించే అవకాశం ఉండదని స్పష్టం చేశారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు సుమారు 1.9 మిలియన్ల మంది అక్రమ వలసదారులు స్వచ్ఛందంగా అమెరికాను విడిచిపెట్టారని, వేలాది మంది ఇప్పటికే CBP హోమ్ యాప్‌ను ఉపయోగిస్తున్నారని క్రిస్టీ నోయెమ్ వెల్లడించారు. గతంలో మే నెలలో 1,000 డాలర్లుగా ఉన్న ప్రోత్సాహకాన్ని క్రిస్మస్ సందర్భంగా మూడు రెట్లు పెంచినట్లు ఆమె తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: