Freddys 2 worldwide collection : హారర్ సీక్వెల్ ‘ఫైవ్ నైట్స్ అట్ ఫ్రెడ్డీస్ 2’ అంతర్జాతీయ బాక్సాఫీస్ వద్ద భారీ పోటీని ఎదుర్కొంటున్నప్పటికీ, ఒక కీలక మైలురాయిని దాటింది. ముఖ్యంగా ‘అవతార్: ఫైర్ అండ్ ఆష్’ విడుదల తర్వాత ఓవర్సీస్ మార్కెట్లలో వసూళ్లు 58 శాతం వరకు తగ్గినా, ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా తన తుది ప్రధాన లక్ష్యాన్ని సాధించింది.
జోష్ హచ్‌ర్సన్ హీరోగా తెరకెక్కిన ఈ హారర్ మూవీ సుమారు 36 మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో రూపొందింది. అయితే ఇప్పటివరకు ఆ బడ్జెట్‌కు ఐదు రెట్లకుపైగా వసూళ్లు రాబట్టి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. విమర్శకుల నుంచి మిక్స్‌డ్ నుంచి నెగటివ్ రివ్యూలు వచ్చినా, ప్రేక్షకుల ఆసక్తితో బాక్సాఫీస్ వద్ద నిలకడగా నిలుస్తోంది. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన హారర్ సినిమాల్లో ఇది టాప్ 5లో ఒకటిగా నిలిచింది.
Read also: TIFFA Scan: రాష్ట్రంలో తొలి సారి 7 ఆస్పత్రుల్లో TIFFA యంత్రాల ఏర్పాటు
అమెరికా దేశీయ మార్కెట్ విషయానికి వస్తే, మూడో వీకెండ్‌లో (మూడు రోజులలో) (Freddys 2 worldwide collection) ఈ సినిమా 7.3 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. గత వీకెండ్‌తో పోలిస్తే ఇది సుమారు 62.5 శాతం తగ్గుదల. అలాగే దాదాపు 567 థియేటర్లను కోల్పోయింది. అయినప్పటికీ, నార్త్ అమెరికాలో ఇప్పటివరకు ఈ సినిమా మొత్తం వసూళ్లు 108.9 మిలియన్ డాలర్లకు చేరాయి. గత వారం దేశీయంగా 100 మిలియన్ డాలర్ల మార్క్‌ను కూడా ఈ చిత్రం దాటిన సంగతి తెలిసిందే.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also :