థైరాయిడ్(Thyroid Tablets) సమస్యకు వాడే మందులు వైద్యుల సూచన మేరకు మాత్రమే తీసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవసరానికి మించిన మోతాదులో థైరాయిడ్ టాబ్లెట్లు తీసుకుంటే శరీరంపై తీవ్రమైన దుష్ప్రభావాలు కనిపించే అవకాశం ఉందని చెబుతున్నారు.
డోస్ ఎక్కువైనప్పుడు ఆకలి అతిగా పెరగడం, అలసట, గుండె వేగంగా కొట్టుకోవడం, ఆందోళన, చిరాకు వంటి లక్షణాలు మొదట కనిపిస్తాయి. దీర్ఘకాలంగా ఇలా కొనసాగితే ఎముకలు బలహీనపడటం (ఆస్టియోపోరోసిస్), నెలసరి సమస్యలు, రక్తపోటు పెరగడం వంటి సమస్యలు తలెత్తుతాయి.

అంతేకాదు, గుండెపై తీవ్రమైన(Thyroid Tablets) ప్రభావం పడే ప్రమాదం ఉండటంతో పాటు స్పృహ కోల్పోవడం, స్ట్రోక్ వచ్చే అవకాశాలు కూడా పెరుగుతాయని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా మహిళల్లో హార్మోన్ల అసమతుల్యత కారణంగా ఆరోగ్య సమస్యలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. ఈ లక్షణాల్లో ఏవైనా కనిపిస్తే ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు. థైరాయిడ్ ఉన్నవారు ప్రతి ఆరు నెలలకు ఒకసారి టెస్టులు చేయించుకుని, డాక్టర్లు సూచించిన మోతాదులోనే మందులు వాడాలని స్పష్టం చేస్తున్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: