Bangladesh unrest news : బంగ్లాదేశ్‌లో కొనసాగుతున్న అశాంతి ఇప్పుడు సరిహద్దులు దాటి భారత్‌కు కూడా ప్రభావం చూపుతోంది. న్యూఢిల్లీ లోని బంగ్లాదేశ్ హైకమిషన్ సమీపంలో జరిగిన నిరసనల నేపథ్యంలో, బంగ్లాదేశ్ ప్రభుత్వం అనిర్దిష్ట కాలానికి వీసా సేవలను నిలిపివేసింది. ఈ పరిణామాలపై భారత్ తీవ్రంగా స్పందించి, బంగ్లాదేశ్ రాయబారిని పిలిపించి మైనారిటీలపై దాడులు, దౌత్య కార్యాలయాల భద్రతపై గట్టి అభ్యంతరం తెలిపింది.
ఈ ఘటన ప్రభావం కోల్‌కతా వీధుల్లోనూ కనిపించింది. మైమెన్సింగ్లో హిందూ యువకుడు దీపు చంద్ర దాస్‌పై జరిగిన అమానుష హత్యకు నిరసనగా, కోల్‌కతాలో బంగ్లాదేశ్ హైకమిషన్ ఎదుట భారీ ఆందోళనలు జరిగాయి. బంగ్లాదేశ్‌లో ఇస్లామిక్ మూకల హింస పెరుగుతోందన్న ఆందోళనతో ప్రజలు పెద్ద ఎత్తున రోడ్డెక్కారు.
Read Also: AP Government: క్రైస్తవుల భద్రతకు భంగం రానివ్వం: సిఎం చంద్రబాబు
దీపు చంద్ర దాస్‌ను బ్లాస్ఫమీ ఆరోపణల (Bangladesh unrest news) పేరుతో ఫ్యాక్టరీ నుంచి లాక్కెళ్లి, కొట్టి, ఉరివేసి, తగలబెట్టిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. అయితే విచారణలో అతడు ఎలాంటి అవమానకర వ్యాఖ్యలు చేయలేదని తేలింది. ఇది ముందస్తు ప్రణాళికతో చేసిన దాడిగా అధికారులు భావిస్తున్నారు. ఇప్పటివరకు ఫ్యాక్టరీ సూపర్వైజర్లు సహా కనీసం 12 మందిని అరెస్టు చేశారు.
ఇదే సమయంలో, గత ఏడాది ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమానికి కీలక నేతగా ఎదిగిన ఒస్మాన్ హాది హత్య కూడా దేశవ్యాప్తంగా ఆందోళనలకు కారణమైంది. ఆయన మృతి తర్వాత ‘ఇంకిలాబ్ మాంచో’ పేరిట ఉద్యమిస్తున్న వేదిక, న్యాయం జరగకపోతే తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చేస్తామని హెచ్చరించింది. ప్రత్యేక ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాలని, అంతర్జాతీయ విచారణ జరపాలని డిమాండ్ చేస్తోంది.
అశాంతి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో మీడియా సంస్థలపై దాడులు కూడా జరిగాయి. ‘డైలీ స్టార్’, ‘ప్రథమ్ అలో’ కార్యాలయాలపై మూకలు దాడి చేసి నిప్పంటించడంతో జర్నలిస్టులు గంటల తరబడి లోపల చిక్కుకున్నారు. మరోవైపు, హిందూ సహా ఇతర మైనారిటీ వర్గాలు భద్రత కల్పించాలని డాకాలో నిరసనలు చేపట్టాయి.
ఇంతటి ఉద్రిక్తతల మధ్య, బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాన సలహాదారు మహ్మద్ యూనస్ వచ్చే ఫిబ్రవరి 12న సాధారణ ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో స్వేచ్ఛాయుత, శాంతియుత ఎన్నికలు సాధ్యమా అన్న సందేహాలు వెల్లువెత్తుతున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: