H1B visa alert : H-1B, H-4 వీసా దరఖాస్తుదారులకు సంబంధించి అమెరికా కీలక ప్రకటన చేసింది. ప్రామాణిక వీసా స్క్రీనింగ్‌లో భాగంగా H-1B, H-4 వీసాలకు దరఖాస్తు చేసుకునే ప్రతి అభ్యర్థిపై ఆన్‌లైన్ ప్రెజెన్స్ (సోషల్ మీడియా) వెట్టింగ్‌ను విస్తరించినట్లు అమెరికా వెల్లడించింది. ఈ తనిఖీలు అన్ని దేశాల అభ్యర్థులకు ప్రపంచవ్యాప్తంగా వర్తిస్తాయని తెలిపింది. ఈ మేరకు భారత్‌లోని US Embassy దరఖాస్తుదారులు ముందుగానే అప్లై చేసుకోవాలని, అదనపు ప్రాసెసింగ్ సమయం పట్టే అవకాశం ఉందని సూచించింది.
ఈ ప్రకటన వెలువడిన సమయంలోనే, భారత్‌లో ఈ నెల చివర్లో జరగాల్సిన వేలాది మంది H-1B వీసా అభ్యర్థుల ఇంటర్వ్యూలు అకస్మాత్తుగా కొన్ని నెలల పాటు వాయిదా పడటం గమనార్హం. డిసెంబర్ 15 నుంచి అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ ఈ విస్తృత వెట్టింగ్‌ను అమల్లోకి తీసుకువచ్చినట్లు ఎంబసీ సోషల్ మీడియా వేదిక Xలో వెల్లడించింది.
Read also: TIFFA Scan: రాష్ట్రంలో తొలి సారి 7 ఆస్పత్రుల్లో TIFFA యంత్రాల ఏర్పాటు
H-1B వీసా ప్రోగ్రామ్‌ను అమెరికా టెక్నాలజీ కంపెనీలు విదేశీ నైపుణ్యాలను (H1B visa alert) నియమించుకునేందుకు విస్తృతంగా ఉపయోగిస్తుంటాయి. ఈ వీసాల ద్వారా వెళ్లే వారిలో భారతీయ టెక్ నిపుణులు, డాక్టర్లు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వీసా అభ్యర్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల మధ్య, H-1B ప్రోగ్రామ్ దుర్వినియోగాన్ని అరికట్టడమే ఈ చర్యల లక్ష్యమని, అయితే అత్యుత్తమ నైపుణ్యాలను నియమించుకునే అవకాశాన్ని కొనసాగిస్తామని ఎంబసీ స్పష్టం చేసింది.
అమెరికా వీసా అనేది హక్కు కాదని, ఒక ప్రత్యేక హోదా మాత్రమేనని ఎంబసీ మరోసారి గుర్తు చేసింది. వీసా మంజూరు అయిన తర్వాత కూడా చట్ట ఉల్లంఘనలు జరిగితే వీసాను రద్దు చేసే అధికారం ఉందని గతంలోనూ స్పష్టం చేసింది. అలాగే విద్యార్థి వీసాలు (F, M, J)తో పాటు ఇప్పుడు H-1B, H-4 వీసాలకూ ఈ విస్తృత స్క్రీనింగ్ వర్తిస్తుందని భారత పార్లమెంట్‌లో కేంద్ర విదేశాంగ శాఖ వెల్లడించింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: