ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం(AP Govt) గాలంట్రీ అవార్డులు పొందిన సైనికులకు అందించే నగదు సహాయాన్ని పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. 2024 జూలై 1 తర్వాత కేంద్ర ప్రభుత్వం (Central Govt) ప్రకటించే చక్ర అవార్డు గ్రహీతలకు ఈ పెరిగిన నగదు సహాయం వర్తించనుంది.
Read Also: Guntakal: 0–5 ఏళ్ల చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన వైద్య ఆరోగ్య శాఖ

కొత్త ఉత్తర్వుల ప్రకారం పరమవీర్ చక్ర అవార్డు(Paramvir Chakra Award) గ్రహీతకు రూ.2 కోట్లు, అశోక్ చక్రకు రూ.1.75 కోట్లు, మహావీర్ చక్రకు రూ.1.5 కోట్లు, కీర్తి చక్రకు రూ.1.25 కోట్లు, వీర్ చక్రకు రూ.1 కోటి, శౌర్య చక్ర అవార్డు పొందిన వారికి రూ.75 లక్షల నగదు ప్రోత్సాహకం అందించనున్నారు.
ఈ మొత్తం ఒకే సారి లంప్సమ్ గా చెల్లించబడుతుంది. ఈ ఉత్తర్వులు 2024 జూలై 1 నుండి అమల్లోకి వస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: