సచివాలయం : రాజధాని అమరావతి ప్రాంతంలో క్వాంటం వ్యాలీలో క్వాంటం కంప్యూటింగ్ (Quantum Computing) సెంటర్ భవనాల నిర్మాణానికి ప్రభుత్వం రూ.103.96కోట్లు కేటాయింపుకు ఆమోదం తెలిపిందని రాష్ట్ర మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన 56వ సిఆర్డీఏ అధార్టి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి ఏపి సచివాలయంలోని ప్రచార విభాగంలో సోమవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ క్వాంటం కంప్యూటింగ్ ఎక్విప్మెంట్ అమరావతి చేరుకోనున్న దృష్ట్యా యుద్ధప్రాతిపదికన రెండు భవనాలను 43వేల చదరపు అడుగుల్లో నిర్మించాలని ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు.
Read also: Tirupati gold missing : తిరుపతి షాక్ వెంకన్న బంగారం మాయం..

Minister Narayana
ఇంటీరియర్ పనుల కోసం రూ.109కోట్లు
భవనాల నిర్మాణానికి టెండర్ పిలిచి ఎల్1 కూడా చేయడం జరిగిందన్నారు. సీఆర్డీఎ అధార్టి భవనాల నిర్మాణాలను వెంటనే ప్రారంభిస్తారని మంత్రి వివరించారు. అలాగే అఖిల భారత సర్వీసు అధికారుల నివాసాల ఇంటీరియర్ పనుల కోసం రూ.109కోట్లు విడుదల చేయడం జరిగిందన్నారు. నాబార్డ్ మంజూరు చేసిన రూ.7500కోట్లలో రూ.1502కోట్లు రీలిజ్ చేయడం జరిగిందన్నారు. వాటిలో రూ.100కోట్లు ఏపిసీఆర్డిఏ, అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ పాలనా వ్యయం మంజూరుకు పర్మిషన్ ఇవ్వడం జరిగిందన్నారు. గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ నిర్ణయం ప్రకారం మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ యూనివర్సిటీ ఏర్పాటుకు 23.127 ఎకరాలు శాఖమూరు గ్రామ పరిధిలో కేటాయించడం జరిగిందన్నారు.
రైతుల్లో నెలకొన్న అపోహాలను తొలగించడానికి
యూనివర్సిటీకి 60సంవత్సరాలు రూ.1/- లీజ్తో ఇవ్వడం జరిగిందన్నారు. వర్సిటీ నిర్మాణానికి ఆయుష్ సంస్థ రూ.750కోట్లకు పైగా వ్యయం చేయనుందన్నారు. జరీబు,నాన్ జరీబు భూములపై రైతుల్లో నెలకొన్న అపోహాలను తొలగించడానికి రాష్ట్రస్థాయి కమిటీని ఏర్పాటు చేయాలన్న నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. జరీబు భూముల భూములపై గతంలో మండలం, కలెక్టర్ల ఆధ్వర్యంలో జిల్లాస్థాయి కమీటీలు 18 ఎకరాలు తప్ప మిగిలిన భూములు నాన్ జరీబు అని తేల్చారని వివరించారు. అయితే రైతు సోదరులు విజప్తి మేరకు వివిధ డిపార్ట్మెంట్ల అధికారులతో రాష్ట్రస్థాయి కమిటిని వేయడం జరుగుతుందన్నారు. 2014డిసెంబర్ 8న తీసిన శాటిలైట్ చిత్రాలను ఆధారంగా జరీబు భూములను నిర్ణయం ఉంటుందని మంత్రి తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: