ఆంధ్రప్రదేశ్ (AP) లో ఈ నెల 24న జరగాల్సిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) విజయానంద్ అధికారికంగా ప్రకటించారు. తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, ఈ నెల 24న నిర్వహించాల్సిన క్యాబినెట్ భేటీని ఈ నెల 29వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు. వాయిదా పడిన ఈ మంత్రివర్గ సమావేశం 29వ తేదీ ఉదయం 10.30 గంటలకు అమరావతిలోని సచివాలయం మొదటి బ్లాకులో జరగనుంది.
Read Also: Christmas Holidays: తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు

రామజన్మభూమి కాంప్లెక్స్
(AP) ఈ సమావేశానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షత వహించనున్నారు. మరోవైపు ఈ నెల 28న CM చంద్రబాబు అయోధ్య వెళ్లనున్నారు. 11.20amకు రామజన్మభూమి కాంప్లెక్స్‌కు చేరుకొని 2.30pm వరకు శ్రీరాముడిని దర్శించుకుంటారు. అనంతరం ఉండవల్లిలోని నివాసానికి తిరుగుపయనమవుతారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: