టీ20 వరల్డ్ కప్ 2026 (T20 World Cup 2026) తో పాటు న్యూజిలాండ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కు భారత జట్టును బీసీసీఐ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.. వచ్చే ఏడాది జనవరిలో న్యూజిలాండ్ పురుషుల క్రికెట్ జట్టు భారత పర్యటనకు రానుంది. ఈ పర్యటనలో భాగంగా మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్‌లు ఆడనుంది. అయితే, న్యూజిలాండ్ స్టార్ బ్యాట్స్‌మెన్ కేన్ విలియమ్సన్ టీమిండియాతో జరిగే వన్డే సిరీస్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఆడేందుకు డర్బన్ సూపర్ జెయింట్స్ జట్టుతో ఒప్పందం కుదుర్చుకున్నాడు.
Read Also: T20 : నేడు విశాఖలో ఉమెన్స్ రెండో టీ20
భారత జట్టు
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, సంజు శాంసన్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, ఇషాన్ కిషన్ , రింకూ సింగ్.

న్యూజిలాండ్ సిరీస్ షెడ్యూల్
టీమిండియా – న్యూజిలాండ్ మధ్య భారత్ వేదికగా జనవరి 2026లో వన్డే, టీ20 సిరీస్ జరగనుంది. జనవరి 11 నుంచి వన్డే సిరీస్ మొదలు కానుండగా, జనవరి 21 నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జనవరి 11 నుంచి 18వ తేదీ వరకు జరగనుండగా, ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జనవరి 21 నుంచి 31వ తేదీ వరకు కొనసాగనుంది. టీ20 వరల్డ్ కప్ నేపథ్యంలో ఈ సిరీస్ ఇరు జట్లకు చాలా కీలకంగా మారనుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: