వాతావరణ మార్పులు, హార్మోన్ల(SkinCareTips) అసమతుల్యత కారణంగా చాలా మంది అమ్మాయిలు మొటిమల సమస్యతో ఇబ్బంది పడుతుంటారు. మొటిమలతో పాటు అవి మిగిల్చే నల్లటి మచ్చలు ముఖ సౌందర్యాన్ని తగ్గిస్తాయి. ఈ సమస్యలను తగ్గించేందుకు చింతపండు మంచి సహజ ఉపాయం అని నిపుణులు సూచిస్తున్నారు.
చింతపండు–ముల్తానీ మట్టి ఫేస్ ప్యాక్

చింతపండు గుజ్జులో ముల్తానీ మట్టి, రోజ్ వాటర్, కొద్దిగా(SkinCareTips) పసుపు కలిపి పేస్ట్‌గా తయారు చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి సమానంగా రాసుకుని సుమారు 15 నిమిషాలు ఉంచాలి. అనంతరం చల్లని నీటితో కడిగితే చర్మం ఫ్రెష్‌గా మారడంతో పాటు మొటిమల ప్రభావం క్రమంగా తగ్గుతుంది. చింతపండు గుజ్జులో మెత్తగా చేసిన అరటిపండు, శెనగపిండి కలిపి ముఖానికి రాస్తే చర్మంలోని మలినాలు తొలగిపోతాయి. ఇది స్కిన్‌ను డీప్‌గా క్లీన్ చేసి సహజ కాంతిని అందిస్తుంది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: