భారతీయ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన మార్కెట్‌లో ప్రముఖ సంస్థ ఏథర్ ఎనర్జీ తన స్కూటర్ల ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది. కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం, జనవరి 1 నుంచి అన్ని ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్ మోడళ్లపై ధరలు పెరగనున్నాయి. మోడల్‌ను బట్టి గరిష్ఠంగా రూ.3,000 వరకు ధరలు పెరుగుతాయి. ముడిసరుకు ధరల పెరుగుదల, అంతర్జాతీయంగా కీలక ఎలక్ట్రానిక్ భాగాల ధరలు అధికమవడం, ఫారెక్స్ ప్రభావం వంటి కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏథర్ స్పష్టం చేసింది.
Read also: AP: ఆంధ్రా ట్యాక్సీ యాప్ ను తీసుకొస్తున్న ఏపీ ప్రభుత్వం

Ather 450
జనవరి నుంచి అమల్లోకి వచ్చే ధరల పెంపు
ప్రస్తుతం ఏథర్ 450 సిరీస్ పెర్ఫార్మెన్స్ స్కూటర్లు మరియు రిజ్తా ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయిస్తోంది. వీటి ధరలు ప్రస్తుతం రూ.1,14,546 నుంచి రూ.1,82,946 మధ్య ఉన్నాయి. జనవరి నుంచి అమల్లోకి వచ్చే ధరల పెంపు ప్రతి మోడల్‌కు వేర్వేరుగా ఉండనుంది. ఇదిలా ఉండగా, వినియోగదారులకు ఊరటగా కంపెనీ ప్రస్తుతం ‘ఎలక్ట్రానిక్ డిసెంబర్’ ప్రత్యేక స్కీమ్ అమలు చేస్తోంది. ఈ ఆఫర్ కింద ఎంపిక చేసిన నగరాల్లో ఏథర్ స్కూటర్ కొనుగోలుపై రూ.20,000 వరకు ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయని సంస్థ తెలిపింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: