ఏపీ ఉపముఖ్యమంత్రి(AP Deputy CM), జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్(Pawan Kalyan)కు ఇవాళ న్యాయపరంగా కీలకమైన ఊరట లభించింది. తన వ్యక్తిగత గోప్యత హక్కులు సోషల్ మీడియాలో ఉల్లంఘించ బడుతున్నాయని ఆరోపిస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు ముఖ్యమైన ఆదేశాలు జారీ చేసింది.
Read also: AP: టిడిపి జిల్లా అధ్యక్ష బాధ్యతలు బిసికే
పేరు, ఫొటో, గొంతు వాడకంపై నిషేధం
తన అనుమతి లేకుండా పేరు, ఫొటో, గొంతు, వ్యక్తిత్వాన్ని వాణిజ్య ప్రయోజనాల కోసం వినియోగించడాన్ని నిలిపివేయాలని పవన్ కళ్యాణ్ కోర్టును కోరారు. ప్రస్తుతం రాజ్యాంగపరమైన బాధ్యతలో ఉన్న వ్యక్తిగా తన ప్రతిష్ఠకు భంగం వాటిల్లడం ప్రజా జీవితంపై ప్రభావం చూపుతోందని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు.

పవన్ కేసులో హైకోర్టు ఆదేశాలు
ఈ వ్యవహారంపై జస్టిస్ మన్మీత్ ప్రీతం సింగ్ అరోరా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టి, పవన్ కళ్యాణ్ వ్యక్తిగత హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన అంశాలను పరిశీలించింది. అనంతరం దర్యాప్తు సంస్థలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
2021 ఐటీ నిబంధనల ప్రకారం పవన్ కళ్యాణ్‌కు సంబంధించిన అభ్యంతరకర చిత్రాలు, వీడియోలు, లింకులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. ఈ మేరకు సంబంధిత సోషల్ మీడియా సంస్థలు, ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్(E-commerce platform)లకు నోటీసులు పంపించి, పవన్ అనుమతి లేకుండా ఉపయోగిస్తున్న కంటెంట్‌ను తొలగించాలని స్పష్టం చేసింది. దీంతో ఈ కేసులో పవన్ కళ్యాణ్‌కు గణనీయమైన న్యాయ ఊరట లభించినట్లైంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: