ఇప్పటికే నాలుగేళ్లుగా రష్యా-ఉక్రెయిన్ లమధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. రెండుదేశాల మధ్య యుద్ధాన్ని ఆపేందుకు ప్రపంచదేశాలు ప్రయత్నిస్తున్నా యుద్ధాన్ని ఆపే పరిస్థితి కనిపించడం లేదు. ఈ పరిస్థితుల్లో రష్యాలో(Car Blast) ఊహించని ఘటన జరిగింది.
Read Also: US: ఎప్‌స్టీన్ ఫైళ్లలో ట్రంప్ చిత్రాల దుమారం

రష్యాలోని దక్షిణ మాస్కోలో కారు బ్లాస్టింగ్ జరిగింది. ఈ ఘటనలో సీనియర్ రష్యన్ లెఫ్టినెంట్ జనరల్ ఫినిల్ సర్వరోవ్ ప్రాణాలు కోల్పోయారు. కారు కింద ఒక పేలుడు పరికరం ఉండడం వల్లే ఈ పేలుడు సంభవించినట్లుగా తెలుస్తోంది. అయితే దీని వెనుక ఉక్రెయిన్ హస్తం ఏమైనా ఉందా? అన్న కోణంలో రష్యన్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. దక్షణ మాస్కోలో సోమవారం ఒక సీనియర్ రష్యన్ సైనిక అధికారి తన కారు కింద ఎపేలుడు పరికరం పేల మరణించారని రష్యన్ అధికారులు తెలిపారు. ఉక్రెయిన్ యుద్ధం(Car Blast) ప్రారంభమైనప్పటి నుంచి సైనిక వ్యక్తులపై జరుగుతున్న ఉన్నతస్థాయి దాడుల్లో ఇదొక సంఘటన అని పేర్కొన్నారు. హత్య కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఉక్రెయిన్ నిఘా వర్గాల ద్వారానే ఈ దాడి జరిగినట్లుగా భావిస్తున్నట్లు దర్యాప్తు కమిటీ అధికారిక ప్రతినిధి స్వెత్లానాపెట్రెంకో అన్నారు.
ప్రమాదంలో సర్వోరోవ్ అక్కడిక్కడే దుర్మరణం
ప్రాథమిక నివేదిక ప్రకారం మాస్కోలోని యాసెనెవో జిల్లాలో వాహనం కదలడం ప్రారంభించిన కొద్దిసేపటికే పేలిపోయింది. ఇంప్రూవైజ్డ్ ఎక్స్ ప్లోజివ్ పరికరం కారణంగా ఈ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో సర్వరోవ్ అక్కడిక్కడే మరణించారు. అయితే ఈ ఘటన ఇప్పటివరకు ఎవరూ బాధ్యత వహించలేదు. రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చలు జరుగుతున్నాయి. ఇలాంటి తరుణంలో సైన్యాధికారి మరణించడం తీవ్ర కలకలం రేపుతోంది. మరోసారి రెండు దేశాలమధ్య ఉద్రిక్తలు తలెత్తే పరిస్థితులు నెలకొన్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: