రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ (Mohan Bhagwat) కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశం ఇప్పటికే హిందూ దేశమని .. దానికి రాజ్యాంగ ఆమోదం అవసరం లేదని వ్యాఖ్యానించారు. కోల్‌కతాలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Read Also: Bangladesh: మారణహోమాన్ని ఆపడానికే భారత్ కు వచ్చాను.. షేక్ హసీనా

సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు.. దీనికి రాజ్యాంగం నుంచి ప్రత్యేకంగా ఆమోదం అవసరమా? భారత్ హిందూ దేశం అన్నది కూడా అలాంటి సత్యమే. హిందుత్వ భావజాలాన్ని విశ్వసించే ఆర్‌ఎస్‌ఎస్.. భారతదేశాన్ని హిందూ దేశంగా మార్చడానికి పార్లమెంటు చట్టాన్ని సవరించాలా..? వద్దా..? అనే దాని గురించి పట్టించుకోదు. ఎందుకంటే మేము హిందువులం. మన దేశం హిందూ దేశం. రాజ్యాంగ పీఠికలో ఆ పదాన్ని చేర్చినా, చేర్చకపోయినా మాకు అభ్యంతరం లేదు. భారతదేశాన్ని మాతృభూమిగా భావించి, భారతీయ సంస్కృతిని గౌరవించి, ఇక్కడి పూర్వీకుల వారసత్వాన్ని గౌరవించే వ్యక్తి ఉన్నంత వరకూ భారత్ హిందూ దేశంగానే ఉంటుంది. ఎందుకంటే హిందుస్థాన్ అనేది పుట్టుకతోనే హిందూ దేశం. ఇది సత్యం’ అని మోహన్ భగవత్ (Mohan Bhagwat) వ్యాఖ్యానించారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: