వైభవంగా శ్రీ సీతారామకల్యాణోత్సవం
ఇంద్రకీలాద్రి : దుర్గమ్మవారి ఆలయంలో వేదోక్తంగా ఆదివారం (Vijayawada) సూర్యఉపాసన సేవను నిర్వహించారు. వేదపండితులు సూర్యాష్టకం, ఆదిత్యహృదయం, ద్వాదశ ఆదిత్యుల ఉపాసనా మంత్రాలను పఠిస్తూ పూజాదికాలు నిర్వహించారు. అనంతరం ధూప, దీప నైవేద్యాలు సమర్పించి భక్తులకు తీర్ధప్రసాద వితరణ చేశారు. శ్రీ దుర్గమ్మవారిని ఆదివారం ఉయ్యూరుకు చెందిన ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులు దర్శించుకున్నారు. వారికి పాలకమండలి సభ్యులు ప్రసాదాలు అందించారు. భక్తులను శ్రీ సీతారామకల్యాణోత్సవం భక్తితన్మయత్వంలో ఆధ్యాత్మిక ఆనందంలో ముంచత్తింది. పూర్ణానందంపేటలోని శ్రీ కోదండ రామాలయంలో ఆదివారం జరిగిన కల్యాణోత్సవాన్ని అర్చకస్వాములు గోపికృష్ణమాచార్యులు, నారాయణ, బాబు నేతృత్వంలో నిర్వహించారు. మాంగల్యదారణ జరిగిన అనంతరం తలంబ్రాలు సమర్పించి ధూప, దీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం భక్తులకు తీర్ధప్రసాద వితరణ చేశారు.
Read Also: AP: రాజ్యాంగ సూత్రాల మేరకే వ్యవహరించాలి: ‘సుప్రీం’ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా

దుర్గమ్మను దర్శించుకున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి
శ్రీ అమ్మవారిని (Vijayawada) ఆదివారం సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత కుమార్(Prashant Kumar) మిశ్రా సతీసమేతంగా దర్శించుకున్నారు. వారికి దుర్గమ్మవారి దర్శనం ఏర్పాటు చేసిన అనంతరం దుర్గమ్మవారి ప్రసాదం, శేషవస్త్రం, మెమొంటోలు అందించారు. వేదపండితులు వేదాశీర్వచనాలు పలికారు.
భక్తులు విరాళాలు
శ్రీ అమ్మవారి ఆలయంలో జరిగే ఉచిత అన్నప్రసాద వితరణ నిమిత్తం రు.1 లక్షను విరాళంగా విజయవాడకు చెందిన ఎం రవీంధ్రనాథ్ తమ కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం విరాళంగా అందించారు. తిరువూరుకు చెందిన అనుమోలు వెంకట ముత్తారావు తమ కుటుంబసభ్యులతో కలిసి రు. 1లక్ష విరాళం అన్నప్రసాద వితరణకు అందించారు. దాతలకు దుర్గమ్మవారి దర్శనం ఏర్పాటు చేసిన అనంతరం దుర్గమ్మవారి ప్రసాదం, శేషవస్త్రం, మెమొంటోలు అందించారు. వేదపండితులు వేదాశీర్వచనాలు పలికారు.
చిన్నారులకు పోలియో చుక్కలు
దుర్గమ్మవారి ఆలయంలో ఆదివారం నాడు చిన్నారులకు పోలియో చుక్కలు వేసే కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఇఓ వికె శీనా నాయక్ మాట్లాడుతూ దుర్గమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యార్ధం ఈ కార్యక్రమం చేపటామన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: