భారత్‌లో స్మార్ట్‌ఫోన్ వినియోగం రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో, సైబర్ నేరాల ముప్పు కూడా అదే స్థాయిలో పెరుగుతోంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం (Central Govt) తాజాగా స్మార్ట్‌ఫోన్ యూజర్లకు కీలక హెచ్చరిక జారీ చేసింది. ప్రమాదకరమైన స్క్రీన్ షేరింగ్ యాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ముఖ్యంగా ఎనీడెస్క్, టీమ్ వ్యూయర్, క్విక్ సపోర్ట్ వంటి యాప్స్ ద్వారా సైబర్ నేరగాళ్లు వ్యక్తిగత,
Read Also: India: రష్యా సాయంతో మూడు కొత్త జలాంతర్గాములు

స్క్రీన్ షేరింగ్ యాప్స్
ఆర్థిక డేటాను దొంగిలించి దుర్వినియోగం చేసే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఈ యాప్స్ ద్వారా స్మార్ట్‌ఫోన్ (Smartphone) ను తమ ఆధీనంలోకి తీసుకుని బ్యాంకింగ్, ఓటీపీలు, వ్యక్తిగత వివరాలు తెలుసుకునే అవకాశం ఉందని తెలిపింది. సాధారణంగా ఈ స్క్రీన్ షేరింగ్ యాప్స్‌ను టెక్నికల్ సపోర్ట్, ఆఫీస్ వర్క్, ఐటీ సేవల కోసం ఉపయోగిస్తారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: