టాలీవుడ్‌లో స్టార్ హీరోల క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఇద్దరి పేర్లు వినగానే థియేటర్లు పండగ వాతావరణాన్ని తలపిస్తాయి. అభిమానుల అభిమానానికి హద్దులు ఉండవు. కొత్త సినిమా విడుదల కాకపోయినా వారి పాత సినిమాలు మళ్లీ థియేటర్లకు వచ్చినా చాలు సంబరాలు మొదలవుతాయి. ప్రస్తుతం టాలీవుడ్‌లో జోరుగా నడుస్తున్న రీ రిలీజ్ ట్రెండ్‌కు ఈ ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు (Movies) మరోసారి బలాన్ని చేకూర్చబోతున్నాయి.
Aditya Dhar: ‘ధురంధర్’ పై ఆర్ జివి రివ్యూ.. స్పందించిన డైరెక్టర్
రీ-రిలీజ్‌తో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశముంది
ఈ క్రమంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘జల్సా’, సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘మురారి’ చిత్రాలు (Movies) మళ్లీ వెండితెరపై సందడి చేయడానికి సిద్ధమయ్యాయి. ఈ రెండు సినిమాల రీ-రిలీజ్ వార్తలతో సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు అభిమానుల మధ్య పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. దీనిని నెటిజన్లు బాక్సాఫీస్ క్లాష్‌గా అభివర్ణిస్తుండగా, ఏ సినిమాకు ఎక్కువ కలెక్షన్లు వస్తాయి? ఏ హీరో క్రేజ్ ఎక్కువగా కనిపిస్తుందన్న అంశాలపై పోలికలు సాగుతున్నాయి.

అయితే ఇది పోటీ కన్నా, ఇద్దరు అగ్ర హీరోల అభిమానులను ఒకే వేదికపై కలిపే అరుదైన సందర్భంగా మారింది. సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్‌లో ‘మురారి’ ఒక మైలురాయి చిత్రంగా నిలిచింది. సంపూర్ణ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా అప్పట్లో ప్రేక్షకుల ఆదరణ పొందిన ఈ సినిమా, రీ-రిలీజ్‌తో మరోసారి అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశముంది. ఇక పవన్ కళ్యాణ్ మాస్ స్వాగ్, త్రివిక్రమ్ మార్కు డైలాగ్స్‌తో సాగిన ‘జల్సా’కి మరో ప్రత్యేక ఆకర్షణ ఉంది. సినిమా ప్రారంభంలో వినిపించే వాయిస్ ఓవర్‌ను ఇచ్చింది స్వయంగా మహేష్ బాబు కావడం విశేషం.
ఈ అంశం ‘జల్సా’ను కేవలం పవన్ అభిమానులకే కాకుండా, మహేష్ అభిమానులకు కూడా ప్రత్యేకమైన సినిమాగా మారుస్తోంది.అయితే ఈ రీ రిలీజ్ హంగామాతో పాటు సోషల్ మీడియాలో మరోసారి ఫ్యాన్స్ వార్ మొదలైంది. కొందరు అభిమానులు ‘మురారి vs జల్సా’ అంటూ పోలికలు మొదలుపెట్టారు. మా హీరో సినిమా కలెక్షన్లు ఎక్కువ… మీ హీరో సినిమా రికార్డులు బ్రేక్ అవుతాయా? అంటూ ట్విట్టర్, ఫేస్‌బుక్‌లలో పోస్టులు, కౌంటర్ పోస్టులతో వాతావరణం వేడెక్కింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: