అనంతపురం టిడిపిలో ఊహించని పరిణామం
అనంతపురం : నిన్న మొన్నటి వరకు అనంతపురం జిల్లా అధ్యక్ష బాధ్యతలను మాజీ మంత్రి, రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులుకు అప్పగిస్తున్నారని జోరుగా ప్రచారం జరిగినప్పటికీ ఎవరూ ఊహించని విధంగా ఆర్టిసి రీజనల్(AP) చైర్మన్ పూల నాగరాజు పేరును పార్టీ అధిష్టాన వర్గం అధికారికంగా ప్రకటించడం చర్చనీ యాంశంగా మారింది. ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పార్టీ జిల్లా అధ్యక్ష పదవి తనకు వద్దని మొరాయించడంతోనే అదే బోయ సామాజిక వర్గానికి చెందిన పూల నాగరాజుకు అవకాశం దక్కిందని చెప్పవచ్చు. అనంతపురం టిడిపి జిల్లా అధ్యక్షునిగా పూల నాగరాజు, ప్రధాన కార్యదర్శిగా జి.శ్రీధర్ చౌదరిని నియమిస్తూ పార్టీ రాష్ట్ర శాఖ అధికారికంగా ప్రకటిం చింది. రాయదుర్గం నియోజకవర్గం గుమ్మఘట్ట జడ్పి టిసిగా పనిచేసి పార్టీలో అంచలంచలుగా ఎదిగారు. గతంలలో జిల్లా పరిషత్ చైర్మన్ గా కూడా పని చేశారు. ప్రస్తుతం ఆర్టిసి అనంతపురం రీజనల్ చైర్మన్గా ఉన్నారు. రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులతో సానిహిత్యం, ప్రోత్సాహం వల్ల పార్టీలో బోయ నాగరాజు కీలకంగా ఎదిగాడని అభిప్రాయం ఉంది. అయితే కొన్నేళ్లుగా ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు, పూల నాగరాజు మధ్య సంబంధాలు అంతంత మాత్రం గానే ఉన్నాయన్న అభిప్రాయం ఉంది. ఆర్టిసి రీజనల్ చైర్మన్ పదవిని కాలవ ప్రత్యర్థి వర్గం ప్రతిపాదించిందనే అభిప్రాయం లేకపోలేదు. ఏది ఏమైనా టిడిపి జిల్లా చర్చనీయాంశంగా మారింది.

Read Also: Bapatla: క్రేన్ లో అగ్నిప్రమాదం: షార్ట్ సర్క్యూట్ తో మంటలు
అనూహ్య నిర్ణయంతో జిల్లాలో రాజకీయ చర్చ
నియోజకవర్గంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర నాయకులను కలుపుకుని ముందుకు సాగడం కత్తి మీద సాములాంటిదే. (AP) టిడిపి (TDP) జిల్లా అధ్యక్షులుగా ఉండాలని గతంలో కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పేర్లు బలంగా వినిపించాయి. ఇప్పటికి నియోజకవర్గ పనులతోపాటు సొంత నిర్మాణ సంస్థ పనులు కూడా ఉండటంతో పార్టీ జిల్లా అధ్యక్ష పదవి వద్దని ఎమ్మెల్యే సురేంద్రబాబు పార్టీ ముఖ్యులకు నచ్చజెప్పినట్లు తెలియవచ్చింది. ఈ నేపథ్యంలో టిడిపి జిల్లా అధ్యక్షునిగా రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పేరు దాదాపు ఖరారు చేశారు. అయితే రాయదుర్గం నియోజకవర్గం అభివృద్దే ధ్యేయంగా పని చేయాలన్న ఆలోచనలో ఉన్నానని తనకు పార్టీ అధ్యక్ష పదవి వద్దని పార్టీ ముఖ్యులకు విజ్ఞప్తి చేసినట్లు తెలియవచ్చింది. అదే సమయంలో కొందరు ఎమ్మెల్యేలు సరైన సహకారం ఉండదని అనవసరంగా రిస్క్ ఎందుకన్నన అభిప్రాయం కూడా ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులో ఉన్నట్లు సమాచారం. పార్టీ జిల్లా అధ్యక్ష పదవి వద్దని ఎమ్మెల్యే కాలవ మొరాయించడంతో ఊహించని విధంగా అనంతపురం ఆర్టిసి రీజనల్ చైర్మన్ పూల నాగరాజుకు దక్కినట్టైంది.
సామాజిక సమీకరణే కీలకంగా మారిన టిడిపి నియామకాలు
టిడిపి జిల్లా అధ్యక్ష పదవికి (AP) నరసనాయుడు, గడ్డం సుబ్రహ్మణ్యం, కంబదూరు రామ్మోహన్ చౌదరి పేర్లు కూడా బలంగా వినిపించినప్పటికీ పార్టీ రాష్ట్ర శాఖ సామాజిక సమీకరణలో భాగంగా వారికి అవకాశం ఇవ్వకుండా ఉరవకొండ నియోజకవర్గం కూడేరు మండలానికి చెందిన జి.శ్రీధర్ చౌదరిని టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శిగా పార్టీ అధిష్టాన వర్గం నియమించింది. పార్టీలో సీనియర్ నేతగా శ్రీధర్ చౌదరికి గుర్తింపు ఉంది. తెలుగు యువతలో ఎన్నో ఏళ్లు పని చేసి పార్టీ బలోపేతానికి కృషి చేశారు. మొన్నటి వరకు టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శిగా జి. శ్రీధర్ చౌదరి పని చేసి పార్టీలో కీలకంగా వ్యవహరించారు. పార్టీ నాయకులు, శాసనసభ్యులు, మంత్రి పయ్యావుల కేశవ్ కూడా శ్రీధర్ చౌదరికి మంచి సంబంధాలు ఉన్నాయి. పార్టీ ప్రధాన కార్యదర్శిగా శ్రీధర్ చౌదరి నియామకం టిడిపి వర్గాల్లో హర్షం వ్యక్తం అవుతోంది. ఇదే సమయంలో టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి పదవి కోసం వివిధ సామాజిక వర్గాల వారు ప్రయత్నాలు చేశారు. వారి ఆశలు ఫలించ లేదు. ఇది టిడిపి జిల్లా కమిటీలోకానీ ఇతర నామినేటెడ్ పోస్టుల్లో ఆశించిన వారికి అవకాశం కల్పించాల్సిన అవసరం కల్పించాల్సిన బాధ్యత పార్టీ అధిష్టానం ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: