తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్-9 గ్రాండ్ ఫినాలే ఊహించని మలుపులతో ముగిసింది. 105 రోజుల పాటు సాగిన ఈ సుదీర్ఘ ప్రయాణంలో కళ్యాణ్ పడాల విజేతగా నిలవగా, తనూజ రన్నరప్‌తో సరిపెట్టుకుంది. అయితే, ఈ ఫినాలేలో అసలైన ట్విస్ట్ ప్రైజ్ మనీ విషయంలో చోటుచేసుకుంది. మొత్తం రూ. 50 లక్షల ప్రైజ్ మనీలో నుంచి టాప్-3 కంటెస్టెంట్ డెమాన్ పవన్ రూ. 15 లక్షల సూట్‌కేస్ ఆఫర్‌ను స్వీకరించి రేసు నుంచి తప్పుకోవడంతో, మిగిలిన ప్రైజ్ మనీ రూ. 35 లక్షలకు పరిమితమైంది. దీంతో విజేతకు దక్కే నగదు విలువ తగ్గిపోయినప్పటికీ, టైటిల్ పోరు మాత్రం రసవత్తరంగా మారింది.
Telangana gram panchayat : నేటినుంచి గ్రామ పంచాయతీల్లో కొత్త పాలకవర్గాలు ఏం మారబోతోంది?…
చివరి నిమిషంలో బిగ్ బాస్ టాప్-2 కంటెస్టెంట్లకు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారు. రన్నరప్‌గా నిలిచే వ్యక్తికి సాధారణంగా ప్రైజ్ మనీ రాదు కాబట్టి, ఆ రిస్క్ తీసుకోలేకపోయేవారి కోసం రూ. 20 లక్షల నగదు ఆఫర్‌ను ప్రకటించారు. ఒకవేళ తనూజ లేదా కళ్యాణ్‌లలో ఎవరైనా ఈ రూ. 20 లక్షలు తీసుకుని తప్పుకుంటే, మిగిలిన రూ. 15 లక్షలు మాత్రమే విజేతకు దక్కుతాయని స్పష్టం చేశారు. ఒక రకంగా చెప్పాలంటే, ఈ ఆఫర్ తనూజకు ఒక గొప్ప అవకాశం. ఎందుకంటే ఆమె రన్నరప్‌గా నిలిస్తే కేవలం రెమ్యునరేషన్ మాత్రమే దక్కుతుంది, కానీ ఈ ఆఫర్ ఓకే చేసి ఉంటే అదనంగా రూ. 20 లక్షలు ఆమె సొంతమయ్యేవి.

అయితే, ఇక్కడే అసలైన డ్రామా జరిగింది. తాను రెండో స్థానంలో ఉన్నాననే విషయాన్ని ఊహించలేకపోయిన తనూజ, టైటిల్‌పై నమ్మకంతో బిగ్ బాస్ ఇచ్చిన రూ. 20 లక్షల ఆఫర్‌ను నిర్మొహమాటంగా తిరస్కరించారు. ఆ సమయంలో ఆమె గెలుపుపై ఉన్న ఆత్మవిశ్వాసం ఆమెను ‘నో’ చెప్పేలా చేసింది. ఫలితంగా, కళ్యాణ్ విజేతగా నిలిచి రూ. 35 లక్షల నగదును కైవసం చేసుకోగా, తనూజ కేవలం రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఒకవేళ ఆమె ఆ ఆఫర్ తీసుకుని ఉంటే, విజేత కళ్యాణ్ కంటే ఎక్కువ ఆర్థిక లాభం పొందే అవకాశం ఉండేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com