సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్, ఈ–కామర్స్ వెబ్సైట్లలో తమ పేర్లు, ఫొటోలు, వీడియోలను అనుమతి లేకుండా వాడటం వల్ల వ్యక్తిగత హక్కులకు భంగం కలుగుతోందని పేర్కొంటూ ఇటీవల కాలంలో పలువురు సినీ సెలబ్రిటీలు కోర్టులను ఆశ్రయించారు. ఇప్పుడు ఈ జాబితాలోకి, నటుడు మాధవన్ (Madhavan) కూడా చేరారు. తన అనుమతి లేకుండా తన పేరు, ఫోటోలను ఉపయోగించి అశ్లీల కంటెంట్‌ను సృష్టిస్తున్నారని నటుడు మాధవన్ (Madhavan) ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.
Read Also: Sharwanand: నారి నారి నడుమ మురారి టీజర్ రిలీజ్

అభ్యంతరకరమైన కంటెంట్
డబ్బు సంపాదించడానికే తన ఇమేజ్ను వాడుకుంటున్నారని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. సోషల్ మీడియాలోని అభ్యంతరకరమైన కంటెంట్‌ను వెంటనే తొలగించాలని న్యాయస్థానం ఆదేశించింది. ముఖ్యంగా, ఏఐ (AI)ని ఉపయోగించి ‘కేసరి 3’, ‘షైతాన్ 2’ వంటి సినిమాల నకిలీ ట్రైలర్లను సృష్టించి, అవి మాధవన్ సినిమాలేనని నమ్మించేలా ప్రచారం చేస్తున్నారని ఆరోపణలున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: