బిగ్‌బాస్ సీజన్ 9 (Bigg Boss 9).. ఎట్టకేలకు విన్నర్ ఎవరనేది తెలిసిపోయింది..ఒక కామనర్‌గా అగ్నిపరీక్ష నుంచి బిగ్‌బాస్ సీజన్-9 (Bigg Boss 9) హౌస్‌లోకి అడుగుపెట్టాడు జవాన్ కళ్యాణ్ పడాల. చివరికి 105 రోజుల అలుపెరగని పోరాటం తర్వాత సరిలేరు నీకెవ్వరూ అంటూ బిగ్‌బాస్ 9 ట్రోఫీని ముద్దాడాడు. టాప్-2గా నిలిచిన తనూజ-కళ్యాణ్ ఇద్దరూ గోల్డెన్ బ్రీఫ్‌కేస్ కాదనడంతో ఇద్దరినీ తీసుకొని స్టేజ్ మీదకి వచ్చారు హోస్ట్ నాగార్జున.కాసేపు అందరినీ ఉత్కంఠకి గురిచేసి చివరికి కళ్యాణ్ పడాలని విన్నర్‌గా ప్రకటించారు.
Read Also: Bigg Boss 9: గ్రాండ్ ఫినాలే ప్రోమో విడుదల
కళ్యాణ్ ఆనందాన్ని తట్టుకోలేక మోకాళ్ల మీద నిల్చొని గట్టిగా అరిచాడు. అలానే నాగార్జున కాళ్లు పట్టుకొని ఆశీర్వాదం తీసుకున్నాడు. దీంతో కళ్యాణ్‌కి ట్రోఫీతో పాటు రూ.35 లక్షల ప్రైజ్ మనీ చెక్, సుజుకీ కారు, అలానే రాఫ్ అడెసివ్ నుంచి రూ.5 లక్షల మరో చెక్కు.. నాగార్జున అందించారు. తనూజ రన్నరప్‌గా నిలిచారు. కల్యాణ్ కు విన్నర్ చెక్ తో పాటు బ్రాండ్ న్యూ మారుతి సుజుకి విక్టోరిస్ కారు, ‘రాఫ్’ నుంచి రూ.5 లక్షల చెక్ కూడా లభించడం విశేషం.

తొలుత నటి సంజన గల్రానీ ఎలిమినేట్
ఫైనల్ రేసులో ఐదుగురు కంటెస్టెంట్లు నిలవగా, ఆదివారం జరిగిన ఫినాలేలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. తొలుత నటి సంజన గల్రానీ ఐదో స్థానంతో ఎలిమినేట్ అయ్యారు. టాప్-3లో ఉంటానని భావించిన ఆమె ఈ ఫలితంతో షాక్‌కు గురయ్యారు. ఆ తర్వాత, టైటిల్ ఫేవరెట్లలో ఒకరిగా ఉన్న కమెడియన్ ఇమ్మాన్యుయేల్ నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నారు.
ఆయన ఎలిమినేషన్ అందరినీ ఆశ్చర్యపరిచింది.ఆ తర్వాత రూ. 15 లక్షల ఆఫర్‌కు డెమోన్ పవన్ అంగీకరించి, పోటీ నుంచి వైదొలిగారు. పవన్ నిష్క్రమణతో విజేత ప్రైజ్‌మనీ రూ. 50 లక్షల నుంచి రూ. 35 లక్షలకు తగ్గింది. చివరికి కల్యాణ్ పడాల అత్యధిక ఓట్లు సాధించి టైటిల్ గెలుచుకోగా, తనూజ రన్నరప్‌గా నిలిచారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: