బిగ్ బాస్ సీజన్ 9 (Bigg Boss 9).. విన్నర్ ఎవరో తెలియడానికి మరికొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఆదివారం (డిసెంబర్ 21) రాత్రి జరగనున్న ఫైనల్ ఎపిసోడ్‌తో ఈ సీజన్ (Bigg Boss 9) విజేత ఎవరో తేలిపోనుంది. ఇప్పటికే గ్రాండ్ ఫినాలేకు సంబంధించిన ప్రిపరేషన్స్, షూటింగ్ పనులు పూర్తయ్యాయి. గత సీజన్లకంటే భిన్నంగా.. కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీల మధ్య జరిగిన పోరులో అంతిమ విజేత ఎవరనేది నేటి ఎపిసోడ్లో తేలనుంది.
Read Also: Bigg Boss 9: టాప్ 5 నుంచి సంజన ఔట్?
ఈవెంట్లో హోస్టింగ్
కళ్యాణ్ పడాల, తనూజ మధ్య నువ్వా నేనా అంటూ పోటీ ఉండటంతో అసలు వీళ్లిద్దరిలో విన్నర్ ఎవరనే నరాలు తెగే ఉత్కంఠ కొనసాగుతోంది. ఓటీటీ సీజన్‌తో కలిసి వరుసగా ఎనిమిదో సీజన్ గ్రాండ్ ఫినాలే ఈవెంట్లో హోస్టింగ్ చేయబోతున్నారు నాగార్జున. ఆయన చేతులపైనే బిగ్ బాస్ సీజన్ 9 విజేతకు ట్రోఫీ అందించనున్నారు. ప్రత్యేకించి ఈ సీజన్లో స్పెషల్ గెస్ట్ లేరు.

గతంలో చిరంజీవి, వెంకటేష్‌లు గెస్ట్లుగా వెళ్లి.. ట్రోఫీ అందించే కార్యక్రమంలో భాగం అయ్యారు. కానీ ఈ సీజన్లో ట్రోఫీ అందించడానికి స్పెషల్ గెస్ట్ లేరు. నాగార్జునే హోస్టూ.. నాగార్జునే గెస్టూ.స్టార్ మా, జియో హాట్ స్టార్‌లో నేటి రాత్రి 7 గంటల నుంచి ప్రసారం కానున్న బిగ్ బాస్ సీజన్ 9 గ్రాండ్ ఫినాలే ఈవెంట్లో బిగ్ బాస్ విజేతను ప్రకటించనున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: