సుప్రీంకోర్టు సంసార జీవితం గురించి కీలక వ్యాఖ్యలు చేసింది. భార్యాభర్తల మధ్య రోజువారీగా జరిగే మాటపోరాటాలు, చిన్న చిన్న మనస్పర్థలను క్రూరత్వంగా పరిగణించలేమని స్పష్టం చేసింది. కుటుంబ ఖర్చుల కోసం ఇచ్చిన డబ్బుకు భర్త లెక్కలు అడగడం సహజమైన విషయమే తప్ప, అది ఐపీసీ సెక్షన్ 498A కింద నేరంగా మారదని ధర్మాసనం తేల్చి చెప్పింది. సంసారంలో ఉండే సాధారణ విభేదాలను క్రిమినల్ కేసులుగా మలచడం సమంజసం కాదని న్యాయస్థానం వ్యాఖ్యానించింది.
Read also: Water dispute: సింధూ జలాల ఒప్పందంపై పాక్ ఆవేదన..

IPC 498A
ఖర్చుల విషయంలో లెక్కలు అడగడం
అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్న ఓ ఎన్నారై దంపతులకు 2016లో వివాహమైంది. వారికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. అయితే 2019లో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో భార్య తన కుమారుడితో కలిసి హైదరాబాద్‌లోని పుట్టింటికి వెళ్లింది. భర్త దాంపత్య హక్కుల పునరుద్ధరణ కోసం నోటీసులు పంపిన అనంతరం, భార్య భర్తతో పాటు అతడి కుటుంబ సభ్యులపై గృహ హింస, వరకట్న వేధింపుల కేసు నమోదు చేయించింది. కుటుంబ ఖర్చులకు ఇచ్చిన డబ్బుకు లెక్కలు అడుగుతున్నారని, భర్త తన తల్లిదండ్రులకు అధిక మొత్తంలో డబ్బు పంపుతున్నాడని ఆమె ఆరోపించింది.
ఈ ఫిర్యాదును సుప్రీంకోర్టు (supreme court) లోతుగా పరిశీలించింది. భర్త తన తల్లిదండ్రులకు డబ్బు పంపడం తప్పుకాదని, ఖర్చుల విషయంలో లెక్కలు అడగడం క్రూరత్వం కిందకు రాదని స్పష్టం చేసింది. బరువు తగ్గాలని చెప్పడం వంటి అంశాలు వ్యక్తిగత అభిప్రాయాలుగా మాత్రమే పరిగణించాల్సిందని, వాటిని 498A నేరంగా చూడలేమని తెలిపింది. భార్య చేసిన ఆరోపణల్లో నేరపూరిత అంశాలు లేవని పేర్కొంటూ, తెలంగాణ హైకోర్టు తిరస్కరించినప్పటికీ సుప్రీంకోర్టు ఎఫ్‌ఐఆర్‌ను పూర్తిగా రద్దు చేసింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: