కన్నడ స్టార్ హీరో యశ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘టాక్సిక్’ గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఇప్పటివరకు విడుదలైన ప్రతి అప్డేట్తో ఆసక్తిని మరింత పెంచుతోంది. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న కియారా అద్వానీ (Kiara Advani) లుక్‌ను చిత్ర బృందం అధికారికంగా విడుదల చేసింది. ఈ చిత్రంలో ఆమె ‘నాడియా’ అనే పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతోంది.
Read Also: Raashi Khanna: పవన్ తో సినిమా.. బీటీఎస్ వీడియోలు పంచుకున్న రాశీ
ఈ కాంబినేషన్ పై భారీ హైప్ క్రియేటయ్యింది
తాజాగా విడుదలైన పోస్టర్లో కియారా అద్వానీ (Kiara Advani) లుక్, ‘నాడియా’ అనే పాత్ర పేరుకు తగ్గట్టే ఆమె గెటప్ వైవిధ్యంగా కనిపిస్తోంది. యష్ సరసన కియారా నటిస్తుండటం ఇదే మొదటిసారి కావడంతో ఈ కాంబినేషన్ పై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. పెద్దలకు సందేశమిచ్చే చిత్రమని, అందుకే ‘ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’ అనే ట్యాగ్‌లైన్ పెట్టామని యశ్ తెలిపారు.
మరోవైపు ఈ సినిమాను ఇంగ్లీష్, కన్నడ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరిస్తున్నారు. వీటితో పాటు తెలుగు, హిందీ, తమిళం, మలయాళం వంటి పలు భారతీయ భాషల్లో డబ్ చేసి విడుదల చేయనున్నారు. కె.వి.ఎన్ ప్రొడక్షన్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్లపై వెంకట్ కె. నారాయణ, యష్ సంయుక్తంగా ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: