దక్షిణాఫ్రికాలో మళ్లీ భయంకరమైన కాల్పుల ఘటన చోటుచేసుకుంది.. జొహన్నెస్‌బర్గ్ (Johannesburg) కు సమీపంలోని ఓ టౌన్‌షిప్‌లో ఆదివారం తెల్లవారుజామున గుర్తుతెలియని దుండగులు జరిపిన కాల్పుల్లో దాదాపు 10 మంది మృతి చెందారు. మరో 10 మంది గాయపడ్డారు. కాల్పులు జరిపిన అనంతరం దుండగులు వాహనాల్లో పారిపోయారు. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నామని, అప్పటికే దుండగులు పారిపోయారని పోలీసులు తెలిపారు.
Read Also: Bangladesh violence: బంగ్లాదేశ్‌లో రాజకీయ హింస భయంకరం.. అగ్నిదాడిలో చిన్నారి మృతి
దక్షిణాఫ్రికాలో ఇది రెండో సామూహిక కాల్పుల ఘటన
నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. క్షతగాత్రులను వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించామన్నారు. కాల్పులు జరిగిన ఏరియా చుట్టుపక్కల బంగారు గనులు ఉన్నాయని, అక్కడ కార్మికులే ఎక్కువగా ఉంటారని పోలీసులు వివరించారు. ఈ ఘటనతోనే ఈ నెలలో దక్షిణాఫ్రికాలో ఇది రెండో సామూహిక కాల్పుల ఘటనగా నమోదు అయింది. డిసెంబరు 6న ప్రిటోరియా సమీపంలో జరిగిన కాల్పుల్లో మూడేళ్ల చిన్నారిసహా 10 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.

Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: