భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో సంచలనం సృష్టించిన ధరావత్ హరినాథ్ మృతి కేసులో కీలక మలుపు తిరిగింది. మొదట ఇది ఆత్మహత్యగా భావించిన పోలీసులు, లోతైన దర్యాప్తులో ఇది పథకం ప్రకారం జరిగిన హత్య(Telangana crime) అని నిర్ధారించారు. ఈ దారుణానికి హరినాథ్ భార్యే తన ప్రియుడితో కలిసి కారణమని పోలీసులు వెల్లడించారు.
Read Also: Illegal Affair : ప్రియుడి కోసం భర్తను చంపి నాటకం

పాల్వంచకు చెందిన హరినాథ్ భార్య శృతిలయ ప్రస్తుతం ములుగు జిల్లాలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్గా పనిచేస్తోంది. గతంలో చర్ల మండలంలో విధులు నిర్వహిస్తున్న సమయంలో ఆమెకు కొండా కౌశిక్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం క్రమంగా వివాహేతర సంబంధంగా మారింది.
ఈ విషయం తెలిసిన భర్త హరినాథ్ పలుమార్లు(Telangana crime) ఆమెను హెచ్చరించారు. పెద్దల వరకు విషయం వెళ్లినా శృతిలయ ప్రవర్తనలో మార్పు రాలేదు. చివరకు తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను తొలగించాలనే నిర్ణయానికి ఆమె వచ్చినట్లు పోలీసులు తెలిపారు.
హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరణ
ఈ నెల 15వ తేదీ తెల్లవారుజామున, మద్యం మత్తులో గాఢ నిద్రలో ఉన్న హరినాథ్‌ను హత్య చేసేందుకు శృతిలయ పథకం అమలు చేసింది. ఆమె తన ప్రియుడు కౌశిక్‌తో పాటు అతని స్నేహితులు చెన్నం మోహన్, డేగల భానులను ఇంటికి పిలిపించింది. నిద్రలో ఉన్న హరినాథ్‌ను నలుగురు కలిసి గొంతునులిమి హతమార్చారు.
హత్య అనంతరం దాన్ని ఆత్మహత్యగా చూపించేందుకు మృతదేహాన్ని ఇంటి వెనుక భాగానికి తీసుకెళ్లి స్లాబ్ హుక్కుకు చీరతో ఉరివేసినట్లు నాటకం ఆడారు. అనంతరం శృతిలయ ఏమీ తెలియనట్టుగా నటిస్తూ, ఉదయం తన భర్త ఉరివేసుకున్నాడంటూ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చింది. మృతదేహం వద్ద కూర్చుని ఏడుస్తూ అందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది.
తల్లి అనుమానం.. నిజం బయటపడింది
అయితే హరినాథ్ మృతిపై అతని తల్లికి అనుమానం కలిగింది. శరీరంపై గాయాలున్నట్లు గమనించిన ఆమె ఇది ఆత్మహత్య కాదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు లోతైన విచారణ ప్రారంభించారు.
శృతిలయ ఇచ్చిన సమాధానాలు పొంతన లేకుండా ఉండటంతో పోలీసులకు అనుమానం బలపడింది. ఆమె కాల్ డేటా, వివాహేతర సంబంధం వివరాలు పరిశీలించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. శృతిలయను, ఆమె ప్రియుడిని విడిగా విచారించగా వారు తమ నేరాన్ని అంగీకరించారు.
పథకం ప్రకారమే హరినాథ్‌ను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు నిర్ధారించారు. దీంతో శృతిలయతో పాటు ఆమె ప్రియుడు, అతని స్నేహితులను పోలీసులు అరెస్ట్ చేశారు. 20 ఏళ్ల క్రితం వివాహమైన హరినాథ్–శృతిలయ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: