బిగ్ బాస్ సీజన్ 9 (Bigg Boss 9) గ్రాండ్ ఫినాలే కి సిద్ధం అయ్యింది. ఈ సీజన్ విన్నర్ ఎవరు అనేది తెలుసుకోవడానికి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం టాప్ 5 కంటెస్టెంట్స్ హౌస్ లో ఉన్నారు. రేపు విన్నర్ ఎవరో తెలిసిపోతుంది. ఇమ్మాన్యుయేల్, తనూజ, సంజన, కళ్యాణ్, డీమన్ పవన్ హౌస్ లో ఉన్నారు. ఈ టాప్ 5 నుంచి ఒకొక్కరిని ఎలిమినేట్ చేసి ఫైనల్ గా ఓ ఇద్దరిని ఉంచి వారిలో ఒకరిని విన్నర్ గా అనౌన్స్ చేస్తారు. కాగా ఇటీవలే హౌస్ లో ఉన్నవారి జర్నీని చూపించారు.
Read Also: Bigg Boss 9: బిగ్‌బాస్ విజేత ఎవరు?
ఈ జర్నీ వీడియో చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. బిగ్ బాస్ హౌస్ (Bigg Boss 9) లోకి ఎంట్రీ దగ్గర నుంచి టాస్క్ లు అన్ని వారాల్లో జరిగిన సంఘటనలు చూపించారు. అవి చూసి ఎమోషనల్ అయ్యారు ఒకొక్కరు. ఇక ఇప్పుడు టాప్ 5 నుంచి ఒకరు ఎలిమినేట్ అయ్యారని తెలుస్తుంది. టాప్ 5 నుంచి ఒకరిని ఎలిమినేట్ చేశారని తెలుస్తుంది. ఆమె ఎవరో కాదు సంజన. టాప్ 5 నుంచి ముందుగా సంజనను హౌస్ నుంచి ఎలిమినేట్ చేశారు. ఆమె ఎలిమినేట్ అవ్వడంతో ప్రస్తుతం హౌస్ లో నలుగురు ఉన్నారు.

ఇమ్మాన్యుయేల్ సూట్ కేస్ తో బయటకు వచ్చే ఛాన్స్
ఇక మిగిలిన నలుగురిలో కళ్యాణ్, తనూజ విన్నర్ రేస్ లో ఉన్నారు. ఇక మిగిలిన వారిలో డీమన్ పవన్, ఇమ్మాన్యుయేల్ ఇద్దరికి సూట్ కేస్ ఆఫర్ వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. వీరిలో ఇమ్మాన్యుయేల్ సూట్ కేస్ తో బయటకు వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తుంది.ఇక విన్నర్ గా కళ్యాణ్ పడాల లేదా తనూజ ఇద్దరిలో ఒకరికి విన్నర్ అయ్యే ఛాన్స్ ఉందని టాక్. సోషల్ మీడియాలో ఇప్పటికే కళ్యాణ్ ఫ్యాన్స్, తనూజ ఫ్యాన్స్ తెగ హడావిడి చేస్తున్నారు. ముందు నుంచి ఈసారి సీజన్ విన్నర్ తనూజ అంటూ గట్టిగానే ప్రచారం జరుగుతుంది.
కానీ తనూజకు గట్టిపోటీ ఇస్తూ దూసుకోచ్చేశాడు కళ్యాణ్ పడాల. కామనర్ గా అడుగుపెట్టి విపరీతమైన ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు కళ్యాణ్. తన వ్యూహం మార్చి టాస్కులలో అదరగొట్టి.. మాట తీరుతో జనాలను కట్టిపడేశాడు. హౌస్ లో కళ్యాణ్, తనూజ స్నేహితులుగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఇద్దరి ఫ్యాన్స్ మధ్య పెద్ద యుద్దమే జరుగుతుంది. ప్రేక్షకులతోపాటు అటు సెలబ్రెటీస్ సైతం ఇప్పుడు బిగ్ బాస్ విన్నర్ కోసం సపోర్ట్ చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: