हिन्दी | Epaper

Women health: PCOSకు నాలుగు రకాలు.. నిపుణులు చెబుతున్న కీలక తేడాలు

Pooja
Women health: PCOSకు నాలుగు రకాలు.. నిపుణులు చెబుతున్న కీలక తేడాలు

ప్రస్తుత జీవనశైలిలో మహిళల్లో ఎక్కువగా కనిపిస్తున్న ఆరోగ్య సమస్యల్లో పీసీఓఎస్ (PCOS) ఒకటి. అయితే ఇది ఒక్క(Women health) రకంగా కాకుండా, లక్షణాల ఆధారంగా నాలుగు విభాగాలుగా ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. వాటిని A, B, C, D టైపులుగా గుర్తించారు.

Women health
Women health

A టైప్ PCOS ఉన్నవారిలో మగ హార్మోన్లు(Women health) అధికంగా ఉండటం, అండం విడుదల కాకపోవడం, అలాగే అండాశయాల్లో తిత్తులు కనిపించడం ప్రధాన లక్షణాలు.
B టైప్‌లో కూడా మగ హార్మోన్ల స్థాయి ఎక్కువగా ఉంటుంది. అయితే ఇందులో నెలసరి సక్రమంగా లేకపోవడం ప్రధాన సమస్యగా ఉంటుంది.
C టైప్ PCOSలో మగ హార్మోన్లు పెరగడం, అండాశయాల్లో తిత్తులు ఉండడం కనిపించినప్పటికీ, నెలసరి సాధారణంగానే జరుగుతుంది.
D టైప్‌లో అండాశయాల్లో తిత్తులు ఉండి, నెలసరి రాకపోవచ్చు. అయితే ఈ రకంలో మగ హార్మోన్ల స్థాయి సాధారణంగానే ఉంటుంది.

ఈ నాలుగు రకాల పీసీఓఎస్‌లో ప్రతి ఒక్కదానికి లక్షణాలు భిన్నంగా ఉండటంతో, సరైన నిర్ధారణతో పాటు తగిన చికిత్స తీసుకోవడం ఎంతో ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870