భారత వ్యతిరేకి, రాడికల్ ఇస్లామిస్ట్ విద్యార్థి నేత షరీఫ్ ఉస్మాన్ హదీ హత్య బంగ్లాదేశ్ (Bangladesh) ను అట్టుడికేలా చేస్తోంది. ఇప్పటికే భారత్ పై తీవ్రంగా వ్యాఖ్యలు, చేస్తూ నిరసనకారులు రోడ్లపై చేస్తున్న ధర్నా హింసాత్మకంగా మారింది. డిసెంబర్ 12న ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు హదీని కాల్చారు. మహ్మద్ యూనస్ ప్రభుత్వం (Muhammad Yunus Government) ఎయిర్ అంబులెన్స్ ద్వారా అతడిని సింగపూర్ కు మెరుగైన వైద్యం కోసం తరలించింది. డిసెంబర్ 19న అతను చికిత్స తీసుకుంటూ
మరణించాడు.
Read Also: AP Crime: రైలు ప్రమాదంలో నవ దంపతులు మృతి..
అయితే, ఇతడి మరణం బంగ్లాదేశ్ లో హింసాత్మక ఘటనలకు కారణమైంది. ఢాకాలో పలు మీడియా సంస్థలపై దాడులు చేయడంతో పాటు, షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీ నేతలపై దాడులకు తెగబడ్డారు. మైమన్నింగ్ జిల్లాలో దైవదూషణకు పాల్పడ్డారనే ఆరోపణలపై ఒక హిందువును దారుణంగా కొట్టి, చట్టుకు ట్టేసి కాల్చి చంపారు. గర్ల్ ఫ్రెండ్ తో పరోక్షంగా చెప్పిన నిందితుడు, ఈ ఘటనకు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
హదీ హంతకుల్లో ఒకరిగా భావిస్తున్న ప్రధాన నిందితుడు ఫైసల్ కరీం, తన గర్ల్ ఫ్రెండ్ తో ఈ హత్య గురించి పరోక్షంగా చెప్పినట్లు తెలిసింది. కాల్పులకు ముందు రోజు రాత్రి ఢాకాలోని ఒక రిసార్ట్లో బస చేసిన పైసల్, తన గర్ల్ ఫ్రెండ్ మరియా అక్తర్ లిమాతో ‘మొత్తం బంగ్లాదేశ్ షేక్ అయ్యే ఘటన’ జరగబోతోందని చెప్పాడు. అతను మరియాకు హదీకి సంబంధించిన ఒక క్లిప్ కూడా చూపించాడని అక్కడి మీడియా నివేదించింది.

‘రేపు (శుక్రవారం) ఏదో జరగబోతోంది. దానితో దేశం మొత్తం వణికిపోతుంది’ అని అక్కడ డైటీ జుగాంతర్ పత్రిక చెప్పింది. ఈ కేసులో మరియాతో సహా పలువురిని అరెస్టు చేశారు. ఫైసల్ కు సాహెదా అక్కడ డైటీ జుగాంతర పత్రిక చెప్పింది. ఈ కేసులో మరియాతో సహా పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. పైసల్ సాహెదా పర్వీన్ సామియా అనే మహిళతో వివాహం జరిగింది. ఆమెతో పాటు అతడి కుటుంబ సభ్యుల్ని పోలీసులు అరెస్టు చేశారు.
ప్రణాళికతో మాటు వేసి హదీని హతమార్చిన దుండగులు
షరీఫ్ ఉస్మాన్ హదీని పక్కా ప్రణాళికతోనే హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసుల దర్యాప్తులో ఒక మాజీ కౌన్సిలర్ పై అనుమానం ఉన్నట్లు తేలింది. నిధుల సమీకరణ, ఆయుధాల సేకరణ, దాడి, పారిపోయేందుకు సహకరించడంతో మొత్తం 20 మంది వ్యక్తులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ కేసులో ఇప్పటివరకు 9మందిని అరెస్టు చేశారు.
పైసల్ సోదరి నివాసంతో కాల్పులకు ఉపయోగించిన మ్యాగజైన్, 11 రౌండ్ల మందుగుండు సామాగ్రి లభించింది. ఢాకా సమీపంలోని ఒక చెరువులో రెండు విదేశీ పిస్టల్లు, రెండు మ్యాగజైన్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితులు పైసల్, అతడి సహాయకులు భారత్ కు పారిపోయినట్లుగా అక్కడి మీడియా నివేదిస్తోంది. కానీ అలాంటి ఆధారాలు లేవని ఢాకా పోలీసులు చెబుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: