తమిళ సినీ ఇండస్ట్రీలో దళపతి విజయ్ (Vijay) ఎన్నో మాస్ బ్లాక్బస్టర్లతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను సొంతం చేసుకున్నాడు. దశాబ్దాల పాటు ప్రేక్షకులను అలరించిన తర్వాత ఇప్పుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే.. ప్రస్తుతం,దళపతి విజయ్ (Vijay) నటిస్తున్న ‘జన నాయగన్’ సినిమా (‘Jana Nayagan’ movie) విడుదలకు ముందే బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. ‘జన నాయగన్’ అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ విషయంలో ఇప్పటికే హిస్టరీ క్రియేట్ చేస్తోంది.
Read Also: Prabhas: ‘రాజాసాబ్’ నుంచి మరో ట్రైలర్ విడుదల?
బుకింగ్స్ ఊహించని స్థాయిలో సాగుతున్నాయి
విజయ్ చివరి సినిమా అనే ప్రచారం, అలాగే ప్రమోషన్స్‌కు వస్తున్న భారీ రెస్పాన్స్ కారణంగా ముందస్తు బుకింగ్స్ ఊహించని స్థాయిలో సాగుతున్నాయి.యూకేలో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమైన తొలి 24 గంటల్లోనే 12,800కు పైగా టికెట్లు అమ్ముడుపోవడం ఇండస్ట్రీని ఆశ్చర్యపరిచింది. ఇప్పటివరకు విజయ్ నటించిన ‘లియో’ చిత్రం (‘Leo’ movie) 10,200 టికెట్లతో రికార్డు సృష్టించగా,

ఇప్పుడు ‘జన నాయగన్’ ఆ రికార్డును అవలీలగా దాటేసింది. యూకే మాత్రమే కాకుండా ఇతర ఓవర్సీస్ మార్కెట్లలో కూడా బుకింగ్స్ వేగంగా పెరుగుతున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. విడుదలకు ఇంకా 20 రోజుల సమయం ఉండగానే ఈ స్థాయిలో అడ్వాన్స్ సేల్స్ జరగడం సినిమా మీద ఉన్న క్రేజ్‌కు నిదర్శనంగా మారింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: