हिन्दी | Epaper
భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్ భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్ భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్ భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్

White house: ట్రంప్ విందుకు హాజరైన మల్లికా షెరావత్

Pooja
White house: ట్రంప్ విందుకు హాజరైన మల్లికా షెరావత్

వైట్ హౌస్ నుంచి ఆహ్వానం అందుకున్న బాలీవుడ్ బామ

వైట్ హౌస్(White house) లో విందుకు ఆహ్వానించబడం అంటే అదెంతో గొప్ప విషయం. ఇది అందరికీ వర్తించదు. కొందరికే.. అదీ గొప్ప నాయకులు, సెలబ్రిటీలకు మాత్రమే ఈ ఘనత లభిస్తుంది. తాజాగా వైట్ హౌస్ లో క్రిస్మస్ వేడుకలు జరుగుతున్నాయి. ఈ వేడుకలకు బాలీవుడ్ నటి మల్లికా షెరావత్ కు కూడా ఆహ్వానం అందింది. దీంతో ఆమె తళుక్కున మెరిసింది. వైట్ హౌస్ లో మల్లికా షెరావత్ ఫొటోలతో తళుక్కున మెరిసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను మల్లికా సోషల్ మీడియా వేదికలో పంచుకుంది.

Read Also: America: ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర

భారతీయ హీరోయిన్ మల్లికా షెరావత్ కు ఆహ్వానం

వాషింగ్టన్ డీసీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా వార్షిక వేడుక జరుగుతుంటుంది. వైట్ హౌస్(White house) లో ట్రంప్ నిర్వహించే క్రిస్మస్ వేడుకలకు వివిధ రంగాలకు సంబంధించిన ప్రముఖులను ఆహ్వానిస్తుంటారు. కేవలం పరిమిత అతిథులకే ఆహ్వానాలు ఉంటాయి. ఈ సారి ఈ బామకు ఆహ్వానం లభించింది. ఉన్నతస్థాయి విందుకు మల్లికా షెరావత్ హాజరు కావడంపై అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఆమెను ఎవరూ ఆహ్వానం పంపారంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

వైట్ హౌస్ ద్వారం వద్ద మల్లికా ఫొటోలు

మల్లికా షెరావత్ పోస్ట్ చేసిన ఫొటోల్లో వైట్ హౌస్ ప్రవేశ ద్వారా దగ్గర పోజులిచ్చినట్లు కనిపించింది. పింక్-ఓంబ్రే స్లిప్ డ్రెస్ ను ఎంచుకుంది. విందులో అతిథులను ఉద్దేశించి ట్రంప్ ప్రసంగిస్తుండగా ఆ సందర్భంలో కూడా సెల్ఫీ ఫొటో దిగింది. వైట్ హౌస్ నుంచి వచ్చిన ఆహ్వాన పత్రికను కూడా మల్లికా షెరావత్ పంచుకుంది. ‘వైట్ హౌస్ క్రిస్మస్ విందుకు ఆహ్వానించబడటం పూర్తిగా అవాస్తవంగా అనిపిస్తుంది.. కృతజ్ఞతతో’ అంటూ రాసుకొచ్చింది. దీంతో ఆమె అభిమానులను ఆకట్టుకుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870