Reserve Bank of India: ఆర్థికంగా దృఢంగా ఉన్న బ్యాంకులకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ కీలక ఉపశమనం కల్పించింది. డిపాజిట్ల బీమా కోసం బ్యాంకులు చెల్లించే ప్రీమియం విధానంలో మార్పులకు ఆర్‌బీఐ(RBI News) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటివరకు అన్ని బ్యాంకులకు ఒకే రకంగా అమలులో ఉన్న ప్రీమియం విధానాన్ని తొలగించి, ఇకపై బ్యాంకు రిస్క్ స్థాయిని బట్టి ప్రీమియాన్ని నిర్ణయించే విధానాన్ని ప్రవేశపెట్టనుంది.
Read also: Adani Group: భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి

మెరుగైన పనితీరు ఉంటే తక్కువ ప్రీమియం
ప్రస్తుతం దేశవ్యాప్తంగా బ్యాంకులు తమ డిపాజిట్లపై ప్రతి రూ.100కు 12 పైసల చొప్పున డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (DICGC)కు ప్రీమియం చెల్లిస్తున్నాయి. అయితే తాజా నిర్ణయంతో ఈ సమాన ప్రీమియం విధానానికి ముగింపు పలకనుంది. బ్యాంకుల ఆర్థిక స్థితి, పనితీరు, నష్ట భయం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ప్రీమియం మొత్తాన్ని నిర్ణయించనున్నారు. దీంతో స్థిరమైన ఆర్థిక పరిస్థితి కలిగిన బ్యాంకులకు ప్రీమియం భారం తగ్గే అవకాశం ఉంది.
ఈ కీలక నిర్ణయానికి హైదరాబాద్‌లో నిర్వహించిన ఆర్‌బీఐ(RBI News) డైరెక్టర్ల బోర్డు సమావేశంలో ఆమోదం లభించింది. ఈ సమావేశానికి ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అధ్యక్షత వహించారు. భేటీలో దేశీయ, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు, బ్యాంకింగ్ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లపై కూడా విస్తృతంగా చర్చ జరిగినట్లు తెలిసింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: