భారతీయ రైల్వేల్లో ఆన్‌లైన్ టికెట్ బుకింగ్‌కు భారీ ఆదరణ లభిస్తున్నట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్(Ashwini Vaishnaw) వెల్లడించారు. లోక్‌సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో, ప్రస్తుతం రిజర్వ్ చేయబడుతున్న మొత్తం టిక్కెట్లలో సుమారు 87 శాతం ఇ-టిక్కెట్లేనని ఆయన పేర్కొన్నారు. ఇది ఇటీవల సంవత్సరాల్లో డిజిటల్ టికెట్ బుకింగ్ ఎంత వేగంగా విస్తరించిందో స్పష్టంగా చూపిస్తోంది.
Read also: Special trains: సంక్రాంతి పండుగ వేళ.. ప్రత్యేక రైళ్లను ప్రకటించిన రైల్వే

చార్ట్ తయారీ విధానంలో కీలక మార్పులు
ఇటీవల సోషల్ మీడియా, కొన్ని మీడియా కథనాల్లో “అన్‌రిజర్వ్డ్ టిక్కెట్లకు ప్రింటెడ్ కాపీ తప్పనిసరి” అనే ప్రచారం జరగడంతో రైల్వేలు(Ashwini Vaishnaw) అధికారికంగా స్పందించాయి. అన్‌రిజర్వ్డ్ టిక్కెట్లకు సంబంధించి నిబంధనల్లో ఎలాంటి మార్పులు చేయలేదని స్పష్టం చేశాయి.
రైల్వే అధికారుల వివరణ ప్రకారం, ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో అన్‌రిజర్వ్డ్ టిక్కెట్ బుక్ చేసి భౌతికంగా ప్రింట్ తీసుకున్న ప్రయాణికులు, ప్రయాణ సమయంలో ఆ టిక్కెట్‌ను వెంట తీసుకెళ్లాలి. అయితే డిజిటల్‌గా అన్‌రిజర్వ్డ్ టిక్కెట్ బుక్ చేసుకుని, ప్రింట్ తీసుకోని వారు, అదే మొబైల్ పరికరంలో టికెట్‌ను చూపిస్తే సరిపోతుందని తెలిపారు. టీటీఈలు ఇకపై మొబైల్ ఫోన్లలో చూపించే టిక్కెట్లను అంగీకరించరన్న ప్రచారాన్ని కూడా రైల్వేలు ఖండించాయి. అలాంటి నిర్ణయం ఏదీ తీసుకోలేదని స్పష్టంగా తెలిపాయి.
రిజర్వేషన్ చార్ట్ తయారీ విధానం ఇలా..
- రైలు బయలుదేరే సమయానికి 4 గంటల ముందు మొదటి రిజర్వేషన్ చార్ట్ సిద్ధం చేస్తారు.
- రైలు బయలుదేరే 30 నిమిషాల ముందు రెండో, తుది చార్ట్ తయారవుతుంది.
- మొదటి చార్ట్ అనంతరం ఖాళీగా ఉన్న సీట్లను రెండో చార్ట్‌లో RAC, వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికులకు కేటాయిస్తారు.
- చివరి నిమిషంలో టిక్కెట్లు రద్దు అయితే, ఆ సీట్లను నేరుగా వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నవారికి కేటాయిస్తారు. దీనివల్ల టిక్కెట్ కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు పెరుగుతాయి.
ప్రాసెసింగ్ సౌలభ్యం, వేగవంతమైన సేవల కారణంగా ఇప్పుడు ఎక్కువ మంది ప్రయాణికులు రైల్వే స్టేషన్ కౌంటర్ల వద్ద క్యూలో నిలబడటం కన్నా ఆన్‌లైన్‌లోనే టిక్కెట్లు బుక్ చేసుకోవడాన్ని ప్రాధాన్యం ఇస్తున్నారని రైల్వేలు పేర్కొన్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: