బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 (Bigg Boss 9) తుది అంకానికి చేరుకుంది. సెప్టెంబర్ 07న అట్టహాసంగా ప్రారంభమైన ఈ రియాలిటీ షో ఈ వారంలోనే ఎండ్ కార్డ్ పడనుంది. డిసెంబర్ 21 రాత్రి జరిగే గ్రాండ్ ఫినాలే కోసం అట్టహాసంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మొత్తం ఐదుగురు కంటెస్టెంట్స్ బిగ్ బాస్ టైటిల్ కోసం పోటీ పడుతున్నారు. తనూజ, పవన్ కల్యాణ్ పడాల, ఇమ్మాన్యుయేల్, డిమాన్ పవన్, సంజనా బిగ్ బాస్ టైటిల్ రేసులో ఉన్నారు.
Read Also: Bigg Boss 9: బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ఎవరు?

ముగ్గురు ఎలిమినేట్
బిగ్‌బాస్-9 విజేత ఎవరో రేపు తేలిపోనుంది. ఇవాళ్టి నుంచి టాప్-5 కంటెస్టెంట్లు ఇమ్మాన్యుయేల్, కళ్యాణ్, తనూజ, డెమాన్, సంజనలో ముగ్గురు ఎలిమినేట్ కానున్నారు. చివరికి టాప్-2లో నిలిచే ఇద్దరిలో విన్నర్‌ను ప్రకటిస్తారు. ఇప్పటికే ఓటింగ్ ప్రక్రియ పూర్తవగా కళ్యాణ్ టాప్ ప్లేసులో ఉన్నట్లు తెలుస్తోంది. అటు తొలిసారి ఫీమేల్ విజేతగా తనూజ నిలవనున్నారని ప్రచారం జరుగుతోంది.
Bigg Boss 9: బిగ్‌బాస్ విజేత ఎవరనుకుంటున్నారు?
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: