ఆంధ్రప్రదేశ్ (AP) రాష్ట్రంలోపాఠశాల, జూనియర్ కళాశాలల పిల్లలకు పరిశుభ్రత అలవాట్లు నేర్పించేందుకు ప్రభుత్వం ‘ముస్తాబు’ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనుంది. ఈ కార్యక్రమం శనివారం నుంచి అధికారికంగా ప్రారంభమవుతుందని విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి.చిన్న వయసులోనే శుభ్రతపై అవగాహన కల్పిస్తే ఆరోగ్య సమస్యలు తగ్గడమే కాకుండా, విద్యార్థుల్లో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది.
Read Also: AP Gov: పొట్టి శ్రీరాములు స్మరణలో అమరజీవి జలధార ప్రాజెక్ట్ ప్రారంభం
జీవనశైలిలో పాటించాల్సిన పరిశుభ్రత అంశాలపై అవగాహన
విద్యార్థుల్లో వ్యక్తిగత శుభ్రత, మంచి అలవాట్లు, క్రమశిక్షణ పెంచే లక్ష్యంతో ఇప్పటికే పార్వతీపురం మన్యం జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ఇక్కడ సత్ఫలితాలు రావడంతో సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు రోజువారీ జీవనశైలిలో పాటించాల్సిన పరిశుభ్రత అంశాలపై అవగాహన కల్పిస్తారు.

Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: