బీజేపీ(BJP) నూతన జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నితిన్ నబీన్‌ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu)ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవలే పదవి స్వీకరించిన నితిన్ నబీన్‌కు చంద్రబాబు అభినందనలు తెలియజేస్తూ, ఆయన నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు.
Read also: YSRCP: మాజీ మంత్రి కొడాలి నాని ప్రధాన అనుచరుడు వినోద్ అరెస్ట్
ఈ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు, ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశం వేగంగా అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని పేర్కొన్నారు. ఈ ప్రయాణంలో ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు సమన్వయంతో పనిచేశాయని, భవిష్యత్తులో కూడా అదే ఐక్యత కొనసాగుతుందని స్పష్టం చేశారు.

నితిన్ నబీన్(Nitin Nabeen)ను యువతరం నాయకుడిగా, ఉత్సాహంతో ముందుకు సాగుతున్న వ్యక్తిగా చంద్రబాబు అభివర్ణించారు. వరుస విజయాలతో రాజకీయ జీవితంలో దూసుకెళ్తున్న ఆయనకు పార్టీ జాతీయ అధ్యక్ష పదవి దక్కడం శుభ సూచకమని అన్నారు.
ప్రధాని మోదీ భారతదేశానికి గ్లోబల్ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారని చంద్రబాబు ప్రశంసించారు. సరైన సమయంలో సరైన నాయకుడు సరైన నిర్ణయాలు తీసుకుంటే దేశం ఎలా ముందుకు వెళ్తుందో మోదీ నాయకత్వమే నిదర్శనమని పేర్కొన్నారు. ఇలాంటి కీలకమైన పార్టీకి నితిన్ నబీన్ నాయకత్వం వహించడం దేశానికి, పార్టీకి మరింత బలాన్ని చేకూరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read also :