ప్రస్తుతం ప్రపంచాన్ని శాసిస్తున్నది సాఫ్ట్‌వేర్ టెక్నాలజీలు కాదు, ఆ సాఫ్ట్‌వేర్ నడవడానికి అవసరమైన ‘సెమీ కండక్టర్ చిప్స్’ (Semiconductors). ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో ఆధిపత్యం చెలాయించాలంటే అత్యాధునిక చిప్స్ కు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా భారీ డిమాండ్ ఉంది. ఇప్పటిదాకా ఈ చిప్స్ తయారీకి అవసరమైన అత్యంత క్లిష్టమైన EUV (Extreme Ultraviolet) లిథోగ్రఫీ మెషీన్లను కేవలం నెదర్లాండ్స్‌కు చెందిన ASML సంస్థ మాత్రమే తయారు చేస్తోంది. అమెరికా ఆంక్షల వల్ల చైనాకు ఈ మెషీన్లు అందడం లేదు. అయితే చైనా (China) దీనిని ఒక సవాల్‌గా తీసుకుని, తన సొంత ‘మ్యాన్‌హట్టన్ ప్రాజెక్ట్’ ను ప్రారంభించింది. ఇప్పుడీ ప్రాజెక్ట్ సంచలన విజయం సాధించినట్లు తెలుస్తోంది.
Read Also: Justice Suryakant : న్యాయమూర్తుల తీరుపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు

ఏమిటీ రహస్య ప్రాజెక్ట్?
రెండో ప్రపంచ యుద్ధ కాలంలో అమెరికా అణుబాంబును తయారు చేయడానికి ఎంత రహస్యంగా ‘మ్యాన్‌హట్టన్ ప్రాజెక్ట్’ ను నడిపిందో.. చైనా కూడా ఇప్పుడు చిప్స్ తయారీ కోసం షెన్‌జెన్ (Shenzhen) లోని ఒక హై-సెక్యూరిటీ ల్యాబ్‌లో అదే స్థాయి ప్రాజెక్టును చేపట్టింది. సుమారు 3,000 మందికి పైగా పరిశోధకులు, వేలాది మంది ఇంజనీర్లు రేయింబవళ్లు శ్రమిస్తూ, ఎట్టకేలకు ఒక EUV ప్రోటోటైప్ మెషీన్ ను తయారు చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి. హువాయి (Huawei) కీలక పాత్ర! ఈ ప్రాజెక్టు లో చైనా టెక్ దిగ్గజం Huawei (హువాయి) వెన్నెముకగా నిలిచింది. పలు ప్రభుత్వ పరిశోధనా సంస్థలు, ప్రైవేట్ కంపెనీలను ఏకం చేసి, చిప్ తయారీలో ఉన్న అతిపెద్ద అడ్డంకిని చైనా అధిగమించింది. 2025 ప్రారంభంలోనే ఈ ప్రోటోటైప్ మెషీన్ సిద్ధమైందని, ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉందని సమాచారం. 2028 లేదా 2030 నాటికి ఈ మెషీన్ల ద్వారా పూర్తిస్థాయిలో చిప్స్ ఉత్పత్తి చేయాలని చైనా (China) లక్ష్యంగా పెట్టుకుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: