తెలంగాణలోని వికారాబాద్(Vikarabad Crime) జిల్లా సాయిపూర్ గ్రామంలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. పరమేశ్ అనే యువకుడు తన భార్య అనూషపై తీవ్ర దాడి చేసి హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ప్రేమ వివాహం చేసుకున్న ఈ దంపతులకు పెళ్లి జరిగి ఇంకా ఎనిమిది నెలలే కావడం గమనార్హం.
Read also: AndhraPradesh Crime: వివాహేతర బంధం.. భర్తను చంపిన భార్య

అనూషతో పరమేశ్ కుటుంబ సభ్యులు
సమాచారం ప్రకారం, వివాహం తర్వాత అనూషతో పరమేశ్ కుటుంబ సభ్యులు తరచూ విభేదాలకు దిగుతున్నారని తెలుస్తోంది. ఇదే క్రమంలో ఇటీవల మాటల తూటాలు తీవ్ర స్థాయికి చేరడంతో, పరమేశ్ ఆగ్రహంతో కర్రతో అనూషను దారుణంగా కొట్టాడు. తీవ్ర గాయాలతో అనూష అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఘటన అనంతరం పరమేశ్ కుటుంబ సభ్యులతో కలిసి పరారైనట్లు పోలీసులు తెలిపారు.
ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read also :