ఇంట్లో ఉన్న కిటికీ అద్దాలు లేదా డ్రెస్సింగ్ టేబుల్ మిర్రర్లు కొన్ని సందర్భాల్లో మసకబారినట్లు కనిపిస్తుంటాయి. వాటిని సరిగా శుభ్రం(Cleaning Tips) చేస్తే మళ్లీ కొత్తవాటిలా మెరుస్తాయి. ఖర్చు లేకుండా ఇంట్లోనే దొరికే వస్తువులతో ఈ సమస్యలకు పరిష్కారం పొందవచ్చు.
Read Also: Tea Benefits: రోజూ ఏ టీ తాగితే మంచిది?

అద్దాలు, మిర్రర్లు మెరిపించేందుకు చిట్కాలు
- అద్దాలు మబ్బుగా కనిపిస్తే ఫిల్టర్ పేపర్‌తో తుడవడం చాలా మంచి ఫలితం ఇస్తుంది. దీంతో అద్దాలపై మచ్చలు తొలగిపోయి తళతళా మెరుస్తాయి.
- గోడలు లేదా గాజుపై పడిన మార్కర్ మరకలు(Cleaning Tips) తొలగించాలంటే, ఆ ప్రాంతంలో కొద్దిగా సన్‌స్క్రీన్ రాసి అరగంట తర్వాత పొడి గుడ్డతో తుడవాలి.
పగిలిన గాజు ముక్కలను సురక్షితంగా తొలగించే విధానం
గాజు వస్తువులు పగిలినప్పుడు ముందుగా చీపురుతో పెద్ద ముక్కలను శుభ్రం చేయాలి. అనంతరం నేలపై బ్రెడ్ ముక్కను అద్దితే, కంటికి కనిపించని చిన్న గాజు తునకలు కూడా దానికే అంటుకుని సురక్షితంగా తొలగిపోతాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: