బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో, ‘ఉరి’ ఫేమ్ ఆదిత్య ధార్ దర్శకత్వంలో రూపొందిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్’ (Dhurandhar Movie) ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఈ చిత్రం సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకుంటోంది. తాజాగా దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఈ సినిమాపై సోషల్ మీడియా ఎక్స్ వేదికగా తన సమీక్షను పంచుకున్నారు. ‘ధురంధర్’ (Dhurandhar Movie) ఒక సాధారణ సినిమా కాదని, భారతీయ సినీ చరిత్రలో ఇదొక క్వాంటం లీప్ అని ఆయన అభిప్రాయపడ్డారు.
Read Also: Avatar 3 Movie: అవతార్ 3 మూవీ రివ్యూ
హింస చాలా సహజంగా ఉంటుంది
ఈ మేరకు ఆయన (Ram Gopal Varma) ఎక్స్ వేదికగా తన అభిప్రాయాన్ని వెల్లడించారు.దర్శకుడు ఆదిత్య ధర్ తన విజన్‌తో భారతీయ సినిమా భవిష్యత్తును ఒంటిచేత్తో మార్చేశారని వర్మ కొనియాడారు. “ఆదిత్య ధర్ కేవలం సన్నివేశాలను డైరెక్ట్ చేయలేదు. పాత్రలు, ప్రేక్షకుల మానసిక స్థితులను ఇంజనీరింగ్ చేశారు. ఈ సినిమా మన దృష్టిని శాసిస్తుంది” అని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు. కథ చెప్పడంలో అసలైన బలం శబ్దంలో కాదని, ఒత్తిడిని పెంచడంలో ఉంటుందని దర్శకుడు నిరూపించారని అన్నారు.
ఈ సినిమాలోని నటన, సాంకేతిక అంశాలను కూడా వర్మ ప్రత్యేకంగా ప్రస్తావించారు. “సాధారణంగా సినిమాల్లో యాక్షన్ దృశ్యాలను చప్పట్ల కోసం డిజైన్ చేస్తారు. కానీ ఇందులో హింస చాలా సహజంగా ఉంటుంది” అని వివరించారు. దర్శకుడు ప్రేక్షకులను తెలివైనవారిగా భావించి, వారికి కథను స్పూన్ ఫీడ్ చేయలేదని ప్రశంసించారు.సినిమా పూర్తయ్యేసరికి కేవలం వినోదం పొందిన భావన కాకుండా, ప్రేక్షకుడిగా మనలో ఏదో మార్పు వచ్చినట్టు అనిపిస్తుందని తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: